
Blue Sky vs Twitter : ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సే తన కొత్త సామాజిక మాధ్యమాన్ని పరిచయం చేసాడు. కొత్త సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ “బ్లూ స్కై” బీటా వెర్షన్ ను విడుదల చేశాడు. ప్రస్తుతం ఇది యాపిల్ యాప్ స్టోర్ లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అతంటికేటేడ్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ పై ఆధారపడి ఇది పనిచేస్తుంది. అంటే కేవలం ఒక సైట్ ద్వారా మాత్రమే కాకుండా పలు సైట్ల ద్వారా ఇది పనిచేస్తుందన్న మాట.
యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ అందించిన వివరాల ప్రకారం ఐవోఎస్ యాప్ స్టోర్ లో ” బ్లూ స్కై” ఫిబ్రవరి 17న అందుబాటులోకి వచ్చింది. ఇక ఇది వచ్చినప్పటినుంచి టెస్టింగ్ దశలోనే రెండువేల మంది వరకు ఇన్స్టాల్ చేసుకున్నారు. దీని యూసర్ ఇంటర్ పేజ్ చాలా సులభంగా ఉంది. యాప్ లో ఉండే ప్లస్ బటన్ క్లిక్ చేసి 256 క్యారెక్టర్లతో పోస్టును క్రియేట్ చేసేలా దీనిని డిజైన్ చేశారు. ఫొటోస్ తో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ట్విట్టర్ పోస్ట్ బాక్స్ లో ” వాట్స్ హ్యాపెనింగ్” అని ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బ్లూ స్కై లో మాత్రం ” వాట్స్ అప్” గా కనిపించనుంది.. ఇందులో షేర్, మ్యూట్, బ్లాక్ అకౌంట్స్ వంటి ఫీచర్లు సైతం ఇందులో ఉన్నాయి.
ఇక ఈ యాప్ కు సంబంధించి బ్లూ స్కై అనేక అధునాతన విధానాలను ప్రవేశపెట్టింది. యాప్ నావిగేషన్ మధ్యలో డిస్కవర్ ట్యాబ్ ను బ్లూ స్కై తీసుకొచ్చింది.. ఎవరిని అనుసరించాలి? రీసెంట్ పోస్టులు వంటి వాటిని శోధించేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని బ్లూ స్కై చెబుతోంది. ఇక వేరే ట్యాబ్లో నోటిఫికేషన్స్, లైక్స్, రీ పోస్టులు, రిప్లై లు, ఫాలోస్.. ఇలా ట్విట్టర్ లో ఉన్నట్టే ఫీచర్లు ఉన్నాయి.
జాక్ డోర్సే నవంబర్లో ట్విట్టర్ సీఈవో పదవి నుంచి దిగిపోయినప్పటి నుంచి బ్లూ స్కై మీద పూర్తిగా అదృష్ట సారించారు.. ఈయన ట్విట్టర్ కు దూరమైన తర్వాత పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈవోగా ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేశాడు.. ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న తర్వాత సంస్థలో చాలా మార్పులు జరిగాయి.. పై చాలా వ్యతిరేకత వ్యక్తం అయింది. ట్విట్టర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉండే కన్నా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గానే ఉండటం మంచిదనే అభిప్రాయాన్ని అప్పట్లో జాక్ డోర్సే వెల్లడించాడు.. అందుకు విరుద్ధంగా మస్క్ ప్రవర్తించాడు.. పైగా పరాగ్ అగర్వాల్ ను, గద్దె విజయను ఉద్యోగాల నుంచి తొలగించాడు. బ్లూ టిక్ కు చార్జి వసూలు చేయడం ప్రారంభించాడు. ఉద్యోగులను తొలగించాడు.. సీఈఓ కుర్చీలో కుక్కను కూర్చోబెట్టాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే మస్క్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఎన్నో.. ఈ క్రమంలో మస్క్ చేస్తున్న పనులపై డోర్సే ఆందోళన వ్యక్తం చేశాడు. సామాజిక మాధ్యమాల వేదికగా అతడు తీరుని విమర్శించాడు. కాగా తన బ్లూ స్కై యాప్ బీటా పరీక్షలకు వెళ్ళనున్నట్టు గత ఏడాది జాక్ ప్రకటించాడు.. ఇక జాక్ బ్లూ స్కై ప్రారంభించిన నేపథ్యంలో ట్విట్టర్ ను మస్క్ ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.