Border-Gavaskar Trophy 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాట్స్మెన్ తేలిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్… ఆస్ట్రేలియా స్పిన్నర్ల దాటికి 33.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. మైదానం నుంచి లభించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకున్న ఆస్ట్రేలియా స్పిన్నర్లు… ఆయన బంతులతో భారత బ్యాటర్లను చేర్చారు. ఆస్ట్రేలియా స్పిన్నర్ల దాటికి భారత బ్యాటర్లలో కోహ్లీ మినహా మరే బ్యాటర్ 50 బంతులకు మించి ఆడలేకపోయారు. దీంతో టీమిండియా తమ పేరిట చెత్త రికార్డు లిఖించుకుంది.

అతి తక్కువ బంతుల్లో
సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో అతి తక్కువ బంతుల్లోనే టీమిండియా ఆల్ అవుట్ అయింది. 2017లో పూణే టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 40.1 ఓవర్లు, రెండు ఇన్నింగ్స్ లో 33.5 ఓవర్లు మాత్రమే ఆడి ఆల్ అవుట్ అయింది. ఆ చెత్త రికార్డును తాజాగా రోహిత్ సేన అధిగమించింది. భారత్లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో టీం ఇండియాకు ఇది నాలుగో అత్యల్ప స్కోరు. అంతకుముందు 2004లో ముంబై టెస్టుల్లో 14 పరుగులకే ఇండియా ఆల్ అవుట్ అయింది. 2017 పూణే టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 105 పరుగులు, తొలి ఇన్నింగ్స్ లో 107 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
గల్లి స్థాయి ఆటనా భయ్యా
18 పరుగులు.. కేవలం 18 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు నేలకులాయి. అవకాశం ఇచ్చాం అదరగొడతాడు అనుకున్న గిల్ మూడు ఫోర్లు కొట్టి ఔట్ అయ్యాడు. రోహిత్ శర్మ అతడి దారినే అనుసరించాడు. చటేశ్వర్ పూజార, రవీంద్ర జడేజా, అయ్యర్.. ఇలా ఐదుగురు ఏదో పని ఉన్నట్టు వరుస పెట్టి పెవిలియన్ చేరారు. ఇక మొదటి రెండు టెస్టులు ఓడిపోయామన్న కసి వల్లో ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. మైదానం మీద ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్నారు. 109 పరుగులకు ఇండియాను ఆల్ అవుట్ చేశారు.. ముఖ్యంగా కునేమాన్ నిప్పులు చెరిగేలా బంతులు వేశాడు. ఐదు వికెట్లు నేలకూల్చాడు. ఇతడికి లయాన్ తోడు కావడంతో భారత బ్యాట్స్మెన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.. లయాన్ కూడా మూడు వికెట్లు తీశాడు. ముర్ఫీ ఒక వికెట్ తీశాడు.