Chandrayaan-4 : ఇస్రో ఈసారి అంతకుమించి.. సరి కొత్తగా చంద్రయాన్ -4

Chandrayaan-4 2040 నాటికి మానవులను చంద్రుడి పైకి పంపించేందుకు ఇస్రో ప్రణాళికలు రూపొందిస్తోంది. అనుకున్నవన్నీ జరిగితే నాసా ను ఇస్రో అధిగమించే రోజు త్వరలోనే కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది.

Written By: NARESH, Updated On : June 28, 2024 5:31 pm

ISRO launches new Chandrayaan-4 mission

Follow us on

Chandrayaan-4 : అందరూ వెళ్లే దారిలో వెళ్తే కిక్కు ఏముంటుంది.. మనకోసం సరికొత్త దారిని ఏర్పరుచుకుంటేనే.. అసలైన మజా లభిస్తుంది. సరిగ్గా ఈ సిద్ధాంతాన్ని ఇప్పుడు ఇస్రో అమలులో పెట్టేందుకు సిద్ధమైంది.. చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయని, హీలియం నిల్వలు ఉన్నాయని.. చంద్రుడిలో ఇంకా మనకు తెలియని చాలా విషయాలు దాగి ఉన్నాయని బయటి ప్రపంచానికి చెప్పిన ఇస్రో.. చంద్రయాన్ -4 ద్వారా మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది.

ఈసారి చంద్రయాన్ -4 ప్రయోగాన్ని ముందెన్నడూ లేని విధంగా నిర్వహించేందుకు ఇస్రో కసరత్తు చేస్తోంది. 2026 నాటికి ఈ మిషన్ మొదలవుతుంది. చంద్రయాన్ -4 ను రెండు భాగాలుగా ప్రయోగించనుంది. రెండు భాగాలను ప్రారంభించిన అనంతరం.. వాటిని అంతరిక్షంలో అనుసంధానం చేయనుంది. ఒకవేళ ఈ ప్రయోగం కనుక సఫలీకృతమైతే.. ఇలాంటి అరుదైన ఘనతను సాధించిన తొలి దేశంగా భారత నిలుస్తుంది.. చంద్రయాన్ -4 కు సంబంధించిన ల్యాండర్ ను ఇస్రో రూపొందిస్తోంది. రోవర్ జపాన్ లో తయారవుతోంది. చంద్రయాన్ -4 ప్రయోగానికి సంబంధించిన రెండు భాగాలు చంద్రుడి లోని శివశక్తి పాయింట్ (దీనికి ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టారు) వద్ద ల్యాండ్ అవుతాయి.. మిషన్ లో భాగంగా శివశక్తి పాయింట్ వద్ద చంద్రుడి ఉపరితలం వద్ద ఉన్న మట్టిని సేకరించి.. తిరిగి భూమి పైకి అవి తీసుకొస్తాయి.

అయితే దీనికోసం తొలిసారిగా అంతరిక్షంలోనే స్పేస్ షటిల్ నిర్మించనున్నారు. దీనివల్ల అంతరిక్షంలోనే శాటిలైట్ నిర్మించేందుకు వీలవుతుంది. ఫలితంగా ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలుస్తుంది. ఇక చంద్రయాన్ -4 కు ఈసారి ఇస్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చంద్రుడి ఉపరితలంపై మట్టి మాత్రమే కాకుండా.. ఇంకా ఎలాంటి నమానాలు తీసుకురావాలనేది ఇస్రో అధికారులు త్వరలో నిర్ణయించనున్నారు. నమూనాల సేకరణలో భాగంగా స్పేస్ డాకింగ్ చేసేందుకు ఇస్రో అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ మిషన్ కు సంబంధించిన అనేక ప్రతిపాదనలను ఆమోదించేందుకు కేంద్రానికి ఇస్రో ఒక నివేదిక పంపించింది.ఇస్రో విజన్ – 2024 లో చేర్చిన నాలుగు ప్రాజెక్టులలో చంద్రయాన్ -4 అత్యంత కీలకమైనది. మరోవైపు 2035 నాటికి భారత్ సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించుకోవాలని భావిస్తోంది. 2040 నాటికి మానవులను చంద్రుడి పైకి పంపించేందుకు ఇస్రో ప్రణాళికలు రూపొందిస్తోంది. అనుకున్నవన్నీ జరిగితే నాసా ను ఇస్రో అధిగమించే రోజు త్వరలోనే కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది.