https://oktelugu.com/

AP Employees : ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

AP Employees కొంత వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం మిగతా వారి కంటే చంద్రబాబు బెటరే. ఎంతైనా హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుగాంచాడు కనుక.

Written By:
  • NARESH
  • , Updated On : June 28, 2024 / 05:27 PM IST

    AP Employees

    Follow us on

    AP Employees : ఆంధ్రప్రదేశ్ నూతనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం పని చేసినా దానికో కారణముంటుంది. బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే పాలనలో తన ముద్ర కనిపించేలా ప్రయత్ని స్తున్నారు. సమర్థ అధికారులకు మంచి పోస్టింగ్ లు ఇచ్చి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారికి చెక్ పెడుతున్నారు. పరిపాలనలో తన దక్షతను నిరూపించుకుంటున్నారు. సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. అధికారంలోకి రావడంతో మంచి జోష్ లో ఉన్న చంద్రబాబు ఎన్నికల్లో పనిచేసిన ఉద్యోగులకు, సిబ్బందికి ఒక నెల జీతం బోనస్ ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

    ఎందుకు ఇచ్చారంటే ఎన్నికల్లో కష్టపడి పని చేసినందుకు బోనస్ ప్రకటించినట్లు స్పష్టమవుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. దాన్నుంచి బయటపడేందుకు చాలాసార్లు ఉద్యోగుల పక్షపాతిని అని నిరూపించుకునేందుకు నాన తండాలు పడుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో తిరిగి అధికారంలోకి మంచి జోష్ లో ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పనిచేసిన సిబ్బందికి ఒక నెల వేతనం బోనస్ ఇచ్చి ఉదారత చాటుకున్నారు.

    మామూలుగా అయితే పనిచేసిన 45 రోజులకు రోజుకు 120 రూపాయలు లెక్క కట్టి జీతం చెల్లిస్తారు. కానీ సిబ్బంది గ్రేడ్ ను బట్టి వారికి నెలా జీతం బోనస్ గా ప్రకటించారు. దీంతో ఉద్యోగులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే భిన్నంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరిలో కొంత మార్పు వచ్చిందనే టాక్ ప్రస్తుతం వినిపిస్తున్నది. కొంత వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం మిగతా వారి కంటే చంద్రబాబు బెటరే. ఎంతైనా హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుగాంచాడు కనుక.