ISRO Bhuvan: చీటికీ మాటికీ గూగుల్ పై ఆధారపడాల్సిన ఖర్మ లేదు.. భారీ స్కెచ్ వేసిన ఇస్రో.. ఇంతకీ ఏం రూపొందించిందంటే?

ఇస్రో ఇటీవల చంద్రయాన్ -3 ప్రయోగం ద్వారా ప్రపంచ దేశాలను తన వైపు తిప్పుకుంది. అంతకుముందు ఇస్రో సామాజిక అవసరాల కోసం భువన్ టూల్ ఏర్పాటు చేసింది. ఇది ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కంటే పది రెట్లు అధికంగా సమగ్రమైన సమాచారాన్ని అందిస్తుంది. ముఖ్యంగా విపత్తుల నిర్వహణ, పట్టణ అభివృద్ధి ప్రణాళిక, వ్యవసాయ విస్తరణ వంటి రంగాలలో విలువైన సమాచారం అందిస్తుంది. భువన్ లో పంచాయత్, ఎన్డీఈఎం (నేషనల్ డాటా బేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్) అనే రెండు కొత్త టూల్స్ కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 9, 2024 8:03 am

ISRO Bhuvan

Follow us on

ISRO Bhuvan: మనకు ఏ కాస్త సందేహం వచ్చినా వెంటనే గూగుల్ ను అడిగేస్తాం. ఎలాంటి సమాచారం కావాలన్నా గూగుల్ లో శోధిస్తాం. కేవలం సమాచారం మాత్రమే కాదు, సమస్త రంగాల్లో గూగుల్ విస్తరించి ఉంది. అందుకే ఒక మనిషి జీవితంలో గూగుల్ అనేది ఒక భాగం అయిపోయింది. గూగుల్ సంస్థ అమెరికా నుంచి కార్యకలాపాలు సాగిస్తుంది. ఒకవేళ గూగుల్ కనుక పనిచేయడం నిలిచిపోతే ప్రపంచం మొత్తం స్తంభించిపోతుంది. ఈ క్రమంలో ఇస్రో వేసిన ఒక అడుగు..గూగుల్ నే సవాల్ చేస్తోంది. గూగుల్ కంటే మెరుగ్గా సమాచార వ్యాప్తిని, సామర్ధ్యాన్ని అందించేందుకు భువన్ ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా అద్భుతమైన పురోగతిని సాధిస్తోంది.

ఇస్రో ఇటీవల చంద్రయాన్ -3 ప్రయోగం ద్వారా ప్రపంచ దేశాలను తన వైపు తిప్పుకుంది. అంతకుముందు ఇస్రో సామాజిక అవసరాల కోసం భువన్ టూల్ ఏర్పాటు చేసింది. ఇది ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కంటే పది రెట్లు అధికంగా సమగ్రమైన సమాచారాన్ని అందిస్తుంది. ముఖ్యంగా విపత్తుల నిర్వహణ, పట్టణ అభివృద్ధి ప్రణాళిక, వ్యవసాయ విస్తరణ వంటి రంగాలలో విలువైన సమాచారం అందిస్తుంది. భువన్ లో పంచాయత్, ఎన్డీఈఎం (నేషనల్ డాటా బేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్) అనే రెండు కొత్త టూల్స్ కూడా అందుబాటులోకి తీసుకురానుంది. యూజర్ల కోసం మెరుగైన అనలటికల్ టూల్స్, డాటా సెట్లు సరఫరా చేయడం ద్వారా స్థానిక పరిపాలన వ్యవస్థలకు తోడ్పాటు ఇచ్చేందుకు భువన్ పంచాయత్ టూల్ ఏర్పాటు చేసినట్టు ఇస్రో అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు జియో స్పెషియల్ డాటా తోడ్పడుతుందని ఇస్రో అధికారులు చెబుతున్నారు.

భువన్ ను సంస్కృత పదమైన ఎర్త్ నుంచి తీసుకున్నారు. ఇది ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ద్వారా భారత దేశంలోని భూ సామర్థ్యాలను పరిశీలించేందుకు తోడ్పడుతుంది. ఈ సాఫ్ట్ వేర్ ఉచితంగా లభిస్తుంది. ఇది యూజర్లకు 2D, 3D బహుళ సెన్సార్, బహుళ తాత్కాలిక ఉపగ్రహ చిత్రాలను యాక్సిస్ చేసేందుకు తోడ్పడుతుంది. ఎర్త్ బ్రౌజర్, ఇంటర్ ఆక్టివ్ గా ఇది పనిచేస్తుంది. వెక్టార్ లేయర్ గా అందించిన చిత్రాల నుంచి బ్యాక్ గ్రౌండ్ డాటాను ఎన్ లార్జ్ చేసే అవకాశాన్ని అందిస్తుంది. భువన్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ నుంచి వాస్తవ సమయానికి సంబంధించిన వివరాలను పొందుపరుస్తుంది. అంతేకాదు అటవీ ప్రాంతాలలో జరిగే అగ్ని ప్రమాదాలను, కరువు కాటకాలను, కాలానుగుణంగా సంభవించే మార్పులను ముందుగానే తెలియజేస్తుంది.