India Vs South Africa T20 : మూడు వన్డేల సిరీస్ 3-0 తో భారత్ దక్షిణాఫ్రికా పై గెలిచింది.. ఏకైక టెస్ట్ మ్యాచ్ దక్కించుకుంది. టి20 మ్యాచ్ ల సిరీస్ లో మాత్రం భారత్ తడబాటుకు గురైంది. తొలి మ్యాచ్లో ఓటమి పాలయ్యింది. రెండో టి20 వర్షం వల్ల రద్దయింది. దీంతో మంగళవారం జరిగే చివరి టి20 మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని టీమిండియా భావిస్తోంది. ఇదే సమయంలో వన్డే, టెస్ట్ మ్యాచ్ లలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. దీంతో అందరి దృష్టి చెన్నై వేదికగా మంగళవారం జరిగే మూడవ టి20 మ్యాచ్ పైనే పడింది.
తొలి టీ 20 మ్యాచ్లో గెలిచి దక్షిణాఫ్రికా జట్టు జోరు మీద కనిపిస్తోంది. మంగళవారం జరిగే మూడవ టి20 మ్యాచ్లో గెలిచి సిరీస్ దక్కించుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. మరోవైపు మూడో మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ సమన్ చేయాలని భారత జట్టు పట్టదలతో ఉంది. రెండవ టి 20 మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్, ఏకైక టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు భారత జట్టు చేతిలో ఓడిపోయింది. టి20 సిరీస్ ను సైతం దక్కించుకోవాలని భావించిన భారత జట్టుకు దక్షిణాఫ్రికా తొలి టి20 మ్యాచ్లో అనుకోని స్ట్రోక్ ఇచ్చింది. ఆ మ్యాచ్లో సఫారీ జట్టు 12 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్, తజ్మీన్ బ్రిట్స్, మరి జెన్ కాప్ సత్తా చాటి దక్షిణాఫ్రికా గెలిపించారు. ఆ మ్యాచ్లో భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందాన, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ వంటి వారు సత్తా చూపించినప్పటికీ భారత జట్టుకు అనుకూల ఫలితం రాలేదు.
ఇక చెన్నై వేదికగా జరిగే చివరి మ్యాచ్లో సత్తా చాటాలని టీమిండియా భావిస్తోంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో భారత జట్టు రాణించాల్సిన అవసరం ఉంది. స్పిన్ బౌలింగ్ కు అనుకూలించే చెన్నై మైదానంపై భారత బౌలర్లు రాణించిన దానినిబట్టే విజయం ఆధారపడి ఉంది. ఇప్పటికే ఈ మైదానంపై భారత జట్టు టెస్ట్ మ్యాచ్ గెలిచింది. అచ్చి వచ్చిన మైదానం కావడంతో భారత జట్టుకే విజయావకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేయాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు వన్డే సిరీస్, టెస్ట్ మ్యాచ్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. ఈ మ్యాచ్ కూడా గెలిచి వరుస ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
భారత జట్టు బ్యాటింగ్ భారాన్ని వైస్ కెప్టెన్ స్మృతి మందాన, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ మాత్రమే మోస్తున్నారు. అది జట్టుకు తీవ్ర ఇబ్బందిగా మారింది.. దురదృష్టవశాత్తు వీరు ముగ్గురు అవుట్ అయితే టీమిండియా టాప్ ఆర్డర్ తడబాటుకు గురవుతోంది. తొలి టి20 మ్యాచ్ లో మిగతా క్రీడాకారిణులు విఫలం కావడంతో టీమిండియా దక్షిణాఫ్రికాను నిలువరించలేకపోయింది.. చివరి t20 లో భారత క్రీడాకారిణులు రాణించాల్సిన అవసరం ఉంది.