Horoscope Today: ఈరోజు రవియోగం.. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి వద్దన్నా ధనం..

ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి.

Written By: Chai Muchhata, Updated On : July 9, 2024 7:49 am

Horoscope Today

Follow us on

Horoscope Today: 2024 జూలై 9 మంగళవారం రోజున ద్వాదశ రాశులపై అశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. మంగళవారం రవి యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన లాభం ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి:
ఈ రాశి వారు కొన్ని కష్టాలను ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో వాగ్వాదాలు ఉంటాయి. మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.

వృషభ రాశి:
బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో సమస్యలు ఎదుర్కొంటారు. కొత్త పెట్టుబడులపై ఇతరుల సలహాలు తీసుకోవాలి.

మిథున రాశి:
వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఓ సమాచారం ఆందోళనను కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి:
ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి.

సింహారాశి:
బంధువులతో విభేదాలు ఉంటాయి. పెండింగు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎక్కువగా వాదనలకు దిగకపోవడం మంచిది. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దు.

కన్య రాశి:
పెండింగు పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు నిజాయితీతో ఉండడం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకోని ప్రయాణాలు ఉంటాయి.

తుల రాశి:
ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు దక్కుతాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇతరుల సలహాలు తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి:
శత్రువులపై దృష్టి పెట్టాలి. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. రాజకీయ రంగంలోని వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు.

ధనస్సు రాశి:
ఉద్యోగులు తోటివారితో ఎక్కువగా వాదనలకు దిగొద్దు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. వ్యాపారులు సీనియర్ల సలహాలు తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి:
ఈ రాశి వారు ఈరోజు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనైన విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలి.

కుంభరాశి:
ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త జీవితాన్ని మొదలుపెడుతారు.

మీనరాశి:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. పెండింగు పనులు పూర్తవుతాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి.