Homeబిజినెస్Intel Core 3 processor: Intel Core 3 ప్రాసెసర్.. పాత వాటికంటే 2.1 రేట్ల...

Intel Core 3 processor: Intel Core 3 ప్రాసెసర్.. పాత వాటికంటే 2.1 రేట్ల లాభం..

Intel Core 3 processor: ఎలక్ట్రానిక్ డివైస్ లో ప్రాసెసర్ కీలకంగా ఉంటుంది. అయితే ఇందులో బెస్ట్ కంపెనీకి చెందిన ప్రాసెసర్ మరిన్ని ప్రయోజనాలను తెస్తుంది. వీటిలో Intel కోర్ ప్రాసెసర్ గురించి చాలామంది చెబుతూ ఉంటారు. అప్డేట్ చేస్తూ Intel Core 3 CPU లను ఇటీవల ప్రపంచ మార్కెట్లో రిలీజ్ చేసింది. ఇది పాఠశాలలు, చిన్న వ్యాపారం చేసుకునే వారు ఉపయోగించే కంప్యూటర్లో అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఇందులో మొదటి AI సిద్ధంగా ఉన్న కోర్ సిరీస్ చిప్ గా పిలుస్తారు. ఇది 40 ట్రిలియన్ ఆపరేషన్ వరకు AI వర్క్ లోడ్ లకు మద్దతు ఇస్తుంది.. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Intel తెలుపుతున్న ప్రకారం కోర్ సిరీస్ 3 మొబైల్ ప్రాసెసర్లు అల్ట్రా సిరీస్ 3 ప్లాట్ ఫామ్ పై నిర్మించబడ్డాయి. ఇందులో తక్కువ శక్తి సామర్థ్యం కోర్లు విలీనం చేసే హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో రోజువారి విధుల కోసం ఉపయోగించే వారికి వర్క్ భారం తగ్గుతుంది. అలాగే ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడుతుంది. దీనిని మల్టీ చీప్ ప్యాకేజ్ డిజైన్ ను ఉపయోగించి తయారు చేశారు. ఇది కంప్యూటర్ లో ఉండే GPU, I/O నో ఏకైకృతం చేస్తుంది. పాత కోర్ సిరీస్ ల కంటే ఇందులో సింగిల్ థ్రెడ్ పనితీరులో 47% మెరుగుదల ఉంటుంది. అలాగే కంప్యూటర్ కు పవర్ అందించేటప్పుడు 64% తక్కువ విద్యుత్ ను ఖర్చు చేస్తుంది. ఈ ప్రాసెసర్ల ద్వారా నడిచే బ్యాటరీలు 18.5 వీడియో స్ట్రీమింగ్, 12.5 గంటల కార్యాలయ అవసరానికి, AI ఆధారిత యాప్స్ ఉపయోగిస్తూ 9.6 గంటల వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు.

ఇంటెల్ కోర్ సిరీస్ 3 లైన్ ఆఫ్ లో NPU 5 ని చేర్చడం.. ఈ ప్లాట్ ఫామ్ పై 40 TOPS AI పనితీరును అందించడం దీని ప్రత్యేకత. దీని ద్వారా 250 కంటే ఎక్కువ అప్లికేషన్లు ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. అలాగే గ్రాఫిక్స్ ఉపయోగించేవారు ఈ ప్రాసెసర్ సపోర్ట్ గా నిలుస్తుంది. ఎన్కోడింగ్, డీకోడింగ్ 60 Hz వద్ద 4 K డిస్ప్లే కు సపోర్టు ఇవ్వడంలో ఇది సహాయపడుతుంది. అలాగే GPU 2.7 రేట్లు ఎక్కువ పనితీరును అందిస్తుంది. మొత్తంగా కంటెంట్ సృష్టించే వారికి మునుపటి తరం ప్రాసెసర్లను పోలిస్తే ఇది 2.1 రేట్ల లాభాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular