Nissan Gravite 7 seater car: ప్రస్తుత కాలంలో 7 సీటర్ కారుపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. రెండు ఫ్యామిలీలు కలిసి దూర ప్రయాణాలు చేయడానికి ఈ కారు ఎంతో అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా కార్యాలయ లేదా వ్యాపార అవసరాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే 7 సీటర్ కారు అనగానే చాలామంది Maruti Suzuki Ertiga గురించి చెబుతారు. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో ఉన్న అతి తక్కువ ధర కారు అని చాలామంది భావన. అయితే ప్రస్తుతం మారుతి ఎర్టిగా కారు ధర రూ.8.80 లక్షల నుంచి రూ.10.30 లక్షల వరకు విక్రయిస్తున్నారు. కానీ రూ.7 లక్షల లోపే వచ్చే 7 సీటర్ కార్లు ఉన్నాయంటే మీరు నమ్మలేరు. కానీ ఇలాంటి కార్లు ఉన్నాయి. వాటి గురించి వివరాల్లోకి వెళితే..
భారత మార్కెట్లో Nissan కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనినుంచి 7 సీటర్ సెగ్మెంట్లో Gravite కారు అందుబాటులో ఉంది. దీని ధర రూ.5.65 లక్షల ప్రారంభంతో విక్రయిస్తున్నారు. ఈ కారులో 1.0 లీటర్ నాచురల్ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ తో పని చేస్తుంది. నగరాల్లో ఉండేవారికి ఫుల్ సపోర్ట్ గా ఉండనుంది. ఎందుకంటే ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. దీంతో ఒకవైపు 7 సీటర్ కారు నగరాల్లో ఇది ట్రాఫిక్ నుంచి సులభంగా బయటకు పడేవిధంగా పనిచేస్తుంది. అలాగే వినియోగదారులు తమ అవసరాలకు తగ్గట్టుగా ట్రాన్స్మిషన్ ను మార్చుకొని ప్రయాణం చేయవచ్చు.
అలాగే Renault కంపెనీకి చెందిన ట్రైబర్ 7 సీటర్ సెగ్మెంట్లో అలరిస్తుంది. ఈ కారు ధర రూ.5.76 లక్షల ప్రారంభం నుంచి విక్రయిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ ధర అనుగుణంగా ఉంటుంది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ నగర ప్రయాణికులకు అనుగుణంగా ఉంటుంది. అలాగే డ్రైవింగ్ చేసేవారికి అనుగుణంగా ఫీచర్లు ఉండడంతో లాంగ్ డ్రైవ్ చేసినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా ఇందులో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కుట్టడం వల్ల ట్రాఫిక్ లో చిక్కుకునే అవకాశం ఉండదు.
ఈ విధంగా ఈ రెండు కార్లు రూ.7 లక్షల లోపే అతి తక్కువ ధరలో 7 సీటర్ కార్లను కొనుగోలు చేయవచ్చు. అయితే అదనపు ఫీచర్లు కావాలని అనుకునేవారు కాస్త ధరలు చెల్లించాల్సి ఉంటుంది.