ప్రూఫ్ లేకుండా ఆధార్ అడ్రస్ మార్చవచ్చు.. ఎలా అంటే..?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు కార్డులలో ఆధార్ కార్డు ఒకటనే సంగతి తెలిసిందే. మన దేశంలో నివశించే పౌరులకు ఆధార్ కార్డ్ ఎంతో అవసరం. ఆధార్ కార్డును కలిగి ఉండటం వల్ల ప్రభుత్వ పథకాల నుంచి రాయితీని పొందడంతో పాటు ప్రభుత్వ సర్వీసులు, పెన్షన్ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చెల్లించే సమయంలో ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ సెంటర్ లేదా ఆధార్ ఈసేవ కేంద్రాలకు వెళ్లడం ద్వారా ఆధార్ […]

Written By: Kusuma Aggunna, Updated On : May 17, 2021 9:01 am
Follow us on

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు కార్డులలో ఆధార్ కార్డు ఒకటనే సంగతి తెలిసిందే. మన దేశంలో నివశించే పౌరులకు ఆధార్ కార్డ్ ఎంతో అవసరం. ఆధార్ కార్డును కలిగి ఉండటం వల్ల ప్రభుత్వ పథకాల నుంచి రాయితీని పొందడంతో పాటు ప్రభుత్వ సర్వీసులు, పెన్షన్ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చెల్లించే సమయంలో ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి.

ఆధార్ సెంటర్ లేదా ఆధార్ ఈసేవ కేంద్రాలకు వెళ్లడం ద్వారా ఆధార్ కార్డ్ లోని అడ్రస్ వివరాలను అప్ డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. యూఐడీఏఐ వెబ్ సైట్ సహాయంతో ఆధార్ కార్డ్ అడ్రస్ ను ఆన్ లైన్ లోనే మార్చుకునే అవకాశం ఉంటుంది. లాంటి అడ్రస్ ప్రూఫ్ అవసరం లేకుండానే ఆధార్ కార్డ్ అడ్రస్ ను సులువుగా మార్చుకోవచ్చు. యూఐడీఏఐ వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన తరువాత మై ఆధార్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.

ఆ తరువాత అప్ డేట్ యువర్ అడ్రస్ ఆన్ లైన్ అనే ఆప్షన్ ను ఎంచుకుని రిక్వెస్ట్ వ్యాలిడేషన్ లెటర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్, క్యాప్చా నంబర్ ను ఎంటర్ చేసి వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మళ్లీ ఆధార్ వివరాలను ఎంటర్ చేసి సెండ్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం మొబైల్ కు వచ్చిన వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత మొబైల్ కు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ తో పాటు క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేసి వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేస్తే ఆధార్ కార్డ్ లో అడ్రస్ అప్ డేట్ అవుతుంది. ఆ తర్వాత పోస్ట్ లో వ్యాలిడేషన్ లెటర్ ఇంటి అడ్రస్ కు వస్తుంది. అందులో ఉండే సీక్రెట్ కోడ్ ను యూఐడీఏఐ వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యి ఎంటర్ చేయడం ద్వారా కొత్త అడ్రస్ ఆధార్ కార్డులో అప్ డేట్ అయిపోతుంది.