కరోనా లక్షణాలు ఉండి నెగిటివ్ వచ్చిందా.. ఏం చేయాలంటే..?

భారత్ లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండగా వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా లక్షణాలు కనిపించిన వాళ్లలో ఎక్కువ మందికి పాజిటివ్ నిర్ధారణ అవుతుంటే కొంతమందిలో మాత్రం లక్షణాలు ఉన్నా నెగిటివ్ నిర్ధారణ అవుతోంది. నెగిటివ్ వచ్చిన వాళ్లు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతోంది. ఆల్ ఇండియా ఇనిసిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరోనా లక్షణాలు ఉండి నెగిటివ్ వచ్చిన వాళ్ల విషయంలో కీలక సూచనలు […]

Written By: Navya, Updated On : May 17, 2021 8:26 am
Follow us on

భారత్ లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండగా వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా లక్షణాలు కనిపించిన వాళ్లలో ఎక్కువ మందికి పాజిటివ్ నిర్ధారణ అవుతుంటే కొంతమందిలో మాత్రం లక్షణాలు ఉన్నా నెగిటివ్ నిర్ధారణ అవుతోంది. నెగిటివ్ వచ్చిన వాళ్లు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతోంది.

ఆల్ ఇండియా ఇనిసిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరోనా లక్షణాలు ఉండి నెగిటివ్ వచ్చిన వాళ్ల విషయంలో కీలక సూచనలు చేసింది. ఆర్టీ పీసీఆర్ పరీక్షలో నెగిటివ్ వచ్చి కరోనా లక్షణాలు కనిపిస్తుంటే మరోసారి పరీక్ష చేయించుకుంటే మంచిదని వెల్లడించింది. జ్వరం, పొడిదగ్గు, రుచి, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని ఎయిమ్స్ చెబుతుండటం గమనార్హం.

కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వాళ్లలో దాదాపు 80 శాతం మందిలో ఇవే లక్షణాలు కనిపిస్తుండటం గమనార్హం. మెడికల్ అండ్ కేర్ ఇన్ హోమ్ ఐసోలేషన్ వెబ్ నార్ లో డాక్టర్ నీరజ్ నిశ్చల్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ఔషధాలను సరైన సమయంలో తీసుకుంటే మాత్రమే వైరస్ కు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా తేలికపాటి లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్ లోకి వెళ్లడం మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

కొంతమంది వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా ఇష్టానుసారం మందులు వాడుతున్నారని అలా వాడితే ప్రమాదమని వైద్యులు తెలుపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మినహా మరో మార్గం లేదని అప్రమత్తతతో వ్యవహరించడం మంచిదని వైద్య నిపుణులు పేర్కొన్నారు.