నేడు మార్కెట్లోకి 2డీజీ మందు..

కరోనా కట్టడికి వైద్య రంగం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రకరకాల ఇంజెక్షన్లు, మెడిసిన్ ద్వారా కరోనా వ్యాప్తికి  వైద్యులు అడ్డుకట్ట వేశారు. తాజాగా  రక్షణ సంస్థ నుంచి మరో మెడిసిన్ ను అందుబాటులోకి తెచ్చారు. కొవిడ్ చికిత్సలో ఉపయోగించే 2డీజీ ఔషధాన్ని డీఆర్డీవో(రక్షణ పరిశోధణ అభివృద్ధి సంస్థ) ఇప్పటికే రెడీ చేసిన విషయం తెలిసిందే. అత్యవసరం కింద అనుమతులు పొందిన దీనిని సోమవారం విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా డీఆర్డీవో […]

Written By: NARESH, Updated On : May 17, 2021 9:25 am
Follow us on

కరోనా కట్టడికి వైద్య రంగం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రకరకాల ఇంజెక్షన్లు, మెడిసిన్ ద్వారా కరోనా వ్యాప్తికి  వైద్యులు అడ్డుకట్ట వేశారు. తాజాగా  రక్షణ సంస్థ నుంచి మరో మెడిసిన్ ను అందుబాటులోకి తెచ్చారు. కొవిడ్ చికిత్సలో ఉపయోగించే 2డీజీ ఔషధాన్ని డీఆర్డీవో(రక్షణ పరిశోధణ అభివృద్ధి సంస్థ) ఇప్పటికే రెడీ చేసిన విషయం తెలిసిందే. అత్యవసరం కింద అనుమతులు పొందిన దీనిని సోమవారం విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా డీఆర్డీవో చైర్మన్ పలు విషయాలను వెల్లడించారు.

ఇప్పటి వరకు క్యాన్సర్ చికిత్సలో 2డీజీ విధానాన్ని ఉపయోగించామన్నారు. ఇప్పుడు కరోనా వైరస్ కట్టడికి కూడా ఆ విధంగానే ప్రయోగం చేయడంతో ఫలితాన్నిచ్చిందన్నారు. శరీరంలో క్యాన్సర్ కణాలకు గ్లూకోజ్ అందకుండా 2డీజీ విధానం ఈ మందు అడ్డుకుంటుందన్నారు. ఇదే విధంగా కరోనా వైరస్ కు గ్లూకోజ్ అందకుండా చేస్తే వైరస్ శరీరం మొత్తం వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ప్యాకెట్ రూపంలో ఉండే దీనిని తొలివిడతగా 10 వేల వరకు మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

దేశరాజధాని ఢిల్లీలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ లు కలిసి దీనిని విడుదల చేయనున్నారు. ఆ తరువాత ఈనెల 27, 28 తేదీల్లో అవసరాన్ని భట్టి మరిన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ముడి పదార్థాలను తెచ్చుకోవడం నుంచి ప్యాకెట్ల తయారు వరకు కనీసం నెల పడుతుందన్నారు. అయితే అనుమతి వచ్చాకే ఈ ప్రక్రియ మొదలవుతుందని డీఆర్డీఏ చైర్మన్ తెలిపారు.

ఇక ఇప్పటి వరకు 2డీజీ ప్యాకెట్ ధర నిర్ణయించలేదు. అయితే అనుమతి వచ్చాకే ధర నిర్ణయం కావచ్చు. అయితే ఒక్కో ప్యాకెట్ ధర రూ.600 ఉండొచ్చని భావిస్తున్నారు. కరోనా వైరస్ చికిత్సలో ఇప్పటి వరకు తీసుకుంటున్న మెడిసిన్ తో పాటు దీనికి కూడా ఉపయోగించవచ్చన్నారు. అయితే ఈ 2డీజీ ద్వారా త్వరగా కోలుకునే అవకాశం ఉందన్నారు. అందువల్ల అత్యవసరం కింద ఆమోదం తెలపడంతో నేడు ప్రారంభం కానున్నట్లు వారు తెలిపారు.