దేశంలో ప్రస్తుతం డిజిటల్ వ్యాలెట్లకు ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతోంది. లావాదేవీలు జరపడానికి ఎక్కువమంది ఫోన్ పే యాప్ ను వినియోగిస్తున్నారు. ఫోన్ పే, ఇతర యూపీఐ యాప్స్ ద్వారా క్షణాల్లో డబ్బులను బదిలీ చేయడం సాధ్యమవుతుంది. అయితే స్మార్ట్ ఫోన్ ను పోగొట్టుకున్న సమయంలో మన ఫోన్ పే యాప్ ద్వారా ఇతరులు లావాదేవీలు జరిపే అవకాశం ఉంటుంది. అలా చేయడం ద్వారా ఫోన్ పే యాప్ దుర్వినియోగం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
అయితే స్మార్ట్ ఫోన్ ను పోగొట్టుకున్న సమయంలో సులభంగానే ఫోన్ పే యాప్ ను బ్లాక్ చేసుకోవచ్చు. ఫోన్ పే యాప్ ను బ్లాక్ చేయాలని అనుకునే వాళ్లు 08068727374 లేదా 02268727374 టోల్ ఫ్రీ నంబర్లకు మొదట కాల్ చేయాలి. ఈ నంబర్లకు కాల్ చేసిన తరువాత నచ్చిన భాషను ఎంచుకోవాలి. ఆ తరువాత ఫోన్ పే యాప్ కు లింక్ అయ్యి ఉన్న మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఆ తరువాత అందులో వన్ టైమ్ పాస్ వర్డ్ రాదనే ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సిమ్ కార్డ్ పోయిందని ఎంచుకొని కస్టమర్ కేర్ ప్రతినిధితో చివరి లావాదేవీకి సంబంధించిన సరైన వివరాలను పంచుకోవడం ద్వారా ఫోన్ పే అకౌంట్ ను సులభంగా బ్లాక్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సులభంగా ఫోన్ పే ఖాతాను బ్లాక్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పావచ్చు.
స్మార్ట్ ఫోన్ ను పోగొట్టుకున్న సమయంలో ఇతర యూపీఐ యాప్స్ ను కూడా ఇదే విధంగా బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా యూపీఐ యాప్స్ నుంచి ఇతరులు లావాదేవీలు జరపకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.