https://oktelugu.com/

ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లకు శుభవార్త.. సులువుగా అడ్రస్ మార్పు..?

దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు ఆధార్ కార్డును వాడుతున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిన సమయంలో ఆధార్ కార్డులో అడ్రస్ ను కచ్చితంగా మార్చుకుంటేనే ఇబ్బందులు పడకుండా ఉండవచ్చు. ఆధార్ డిప్యూటీ జనరల్ డైరెక్టర్ ఆర్ ఎస్ గోపాలన్ మాట్లాడుతూ ఆధార్ కార్డ్ చిరునామా మార్పులను కేంద్ర ప్రభుత్వం సరళతరం చేసిందని చెప్పారు. ఆధార్ కార్డ్ లో అడ్రస్ మార్చుకోవాలని అనుకునే వాళ్లు గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరణ పత్రం ద్వారా అడ్రస్ ను మార్చుకోవచ్చని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 19, 2021 12:07 pm
    Follow us on

    దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు ఆధార్ కార్డును వాడుతున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిన సమయంలో ఆధార్ కార్డులో అడ్రస్ ను కచ్చితంగా మార్చుకుంటేనే ఇబ్బందులు పడకుండా ఉండవచ్చు. ఆధార్ డిప్యూటీ జనరల్ డైరెక్టర్ ఆర్ ఎస్ గోపాలన్ మాట్లాడుతూ ఆధార్ కార్డ్ చిరునామా మార్పులను కేంద్ర ప్రభుత్వం సరళతరం చేసిందని చెప్పారు. ఆధార్ కార్డ్ లో అడ్రస్ మార్చుకోవాలని అనుకునే వాళ్లు గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరణ పత్రం ద్వారా అడ్రస్ ను మార్చుకోవచ్చని ఆయన తెలిపారు.

    గెజిటెడ్ ఆఫీసర్ ఇచ్చిన లేఖను ప్రామాణికంగా తీసుకోవడంతో పాటు రేషన్ కార్డ్, రెంటల్ అగ్రిమెంట్, వంట గ్యాస్ బిల్లులను కూడా చిరునామాను మార్చుకోవడానికి ఆమోదిస్తున్నామని తెలిపారు. స్వీయ ధృవీకరణతో ఆధార్ లో అడ్రస్ మార్చుకోవడం సాధ్యం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఆధార్ లో పేరు, పుట్టినతేదీ వివరాలను ఆధార్ కేంద్రాల్లో లేదా ఆన్ లైన్ లో కూడా మార్చుకునే అవకాశం ఉంటుందని ఎస్ గోపాలన్ చెప్పుకొచ్చారు.

    బ్యాంకులతో పాటు సెల్ఫ్ సర్వీస్ అప్ డేట్ పోర్టల్ ద్వారా కూడా ఆధార్ కార్డులో వివరాలను మార్చుకోవచ్చని గోపాలన్ అన్నారు. కరోనా వ్యాక్సిన్ ను ఆధార్ తో లింక్ చేయడం వల్ల సరైన లెక్కలు తెలుస్తున్నాయని ఆదాయపు పన్నుతో ఆధార్ ను లింక్ చేయడంతో సరైన పన్ను రిటర్నులు దాఖలు చేసే అవకాశం ఉంటుందని ఎస్ గోపాలన్ వెల్లడించారు. ఏపీ జనాభా 5.39 కోట్లు కాగా 4.90 కోట్ల మందికి ఆధార్ కార్డులు జారీ చేశామని అన్నారు.

    తెలంగాణ జనాభా 3.95 కోట్లు కాగా 3.95 కోట్ల కార్డులు జారీ అయ్యాయని తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఎక్కువగా జీవిస్తున్నారని ఎస్ గోపాలన్ చెప్పుకొచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 0 – 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు కార్డులు పొందాల్సి ఉందని ఆయన అన్నారు.