Homeజాతీయ వార్తలుKarnataka Sanitation Worker: చేసేది ‘పాకి’ పని.. వచ్చేది ఫార్చునర్ కారులో.. అన్నా నువ్వు సూపర్...

Karnataka Sanitation Worker: చేసేది ‘పాకి’ పని.. వచ్చేది ఫార్చునర్ కారులో.. అన్నా నువ్వు సూపర్ అంతే

Karnataka Sanitation Worker: ఈ వీడియో చూసిన తర్వాత.. గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు.. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు తలదించుకుంటారు. తమను తామే తిట్టుకుంటారు. ఎందుకురా బాబు మనకు ఈ చదువులు.. ఎందుకు బ్రదర్ మనకి ఉద్యోగాలు అనుకుంటూ తిట్టుకుంటారు. ఎందుకంటే ఇతడు చేసిన అద్భుతం.. ఇతడు అనుభవిస్తున్న లగ్జరీ అటువంటిది కాబట్టి. మన ప్రాంతాలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు సైకిల్ లేదా చిన్నపాటి మోటార్ బైక్ ల మీద విధులకు వస్తూ […]

Karnataka Sanitation Worker: ఈ వీడియో చూసిన తర్వాత.. గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు.. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు తలదించుకుంటారు. తమను తామే తిట్టుకుంటారు. ఎందుకురా బాబు మనకు ఈ చదువులు.. ఎందుకు బ్రదర్ మనకి ఉద్యోగాలు అనుకుంటూ తిట్టుకుంటారు. ఎందుకంటే ఇతడు చేసిన అద్భుతం.. ఇతడు అనుభవిస్తున్న లగ్జరీ అటువంటిది కాబట్టి.

మన ప్రాంతాలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు సైకిల్ లేదా చిన్నపాటి మోటార్ బైక్ ల మీద విధులకు వస్తూ ఉంటారు. పైగా వీళ్ళవి పేద కుటుంబాలు. పిల్లలని సాకాలి. వాళ్లకు చదువులు చెప్పించాలి. అనేక రకాల బాధ్యతలను మోయాలి. చివరికి ఎంతో కొంత డబ్బులు మిగులుతాయి వాటితో వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవాలి. మెజార్టీ పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి ఇలానే ఉంటుంది. కానీ కర్ణాటక రాష్ట్రంలో పారిశుధ్య కార్మికుడు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. అతడు విధులకు హాజరయ్యే తీరు.. చాలామందిని ఆలోచింపచేసే విధంగా ఉంది.

కర్ణాటక రాష్ట్రంలోని బంట్వల ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికుడు శేషప్పన్న తన విధులకు హాజరవుతున్నప్పుడు ఫార్చునర్ కార్ లో వస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో ఒక ఫార్చునర్ కారు నిర్వహించడం అంత ఈజీ కాదు. దానికి అనేక రకాల ఖర్చులు ఉంటాయి. పైగా పెద్ద పెద్ద స్థాయి కాంట్రాక్టర్లు.. రాజకీయ నాయకులు.. సెలబ్రిటీలు మాత్రమే అటువంటి కార్లను నిర్వహించగలరు. అయితే శేషప్పన్న నెలకు 40,000 సంపాదిస్తున్నాడు. దీంతోపాటు అతడు పశువుల పెంపకం కూడా చేపడుతుంటాడు. పశువుల పెంపకం ద్వారా అతడికి భారీగా ఆదాయం వస్తూ ఉంటుంది. ఇతడు 1996 నుంచి శానిటేషన్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. మొదట్లో ఇతడిది పేద కుటుంబమే. అయితే పైసా పైసా కూడపెట్టి ఈ స్థాయికి చేరుకున్నాడు. తద్వారా విలాసవంతమైన కారు కొనుగోలు చేశాడు. పశువుల పెంపకం కుటుంబ సభ్యులు చూసుకుంటారు. ఇతడు పారిశుద్ధ్య పనికి హాజరైన తర్వాత.. కుటుంబ సభ్యులు పశువుల పెంపకాన్ని పర్యవేక్షిస్తుంటారు. పాలు అమ్మడం ద్వారా ఇతడికి భారీగా డబ్బువస్తూ ఉంటుంది. అందువల్ల ఇతడు ఈ స్థాయిలో కారు కొనుగోలు చేశాడు. అతని కారు నడపడానికి ప్రత్యేకంగా డ్రైవర్ ఉంటాడు. ఈ కారు విలువ కూడా దాదాపు 30 లక్షల వరకు ఉంటుందని సమాచారం. అంత డబ్బు పెట్టి అతడు కారు కొనుగోల చేశాడంటే సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper