GPT-5 Impact on IT Jobs: టెక్నాలజీ ప్రపంచంలో మార్పులు వేగంగా సాగుతున్నాయి. మొదట కోడింగ్ నైపుణ్యాలు లక్షలాది ఉద్యోగాలు సృష్టించాయి, ఆదాయాలను పెంచాయి. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో, ముఖ్యంగా ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ–5 (జీపీటీ–5) మోడల్‌తో, కోడింగ్ డిమాండ్ మారిపోతోంది. 2025 ఆగస్టు 7న విడుదలైన ఈ మోడల్, కోడింగ్‌లో అధునాతన సామర్థ్యాలతో, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లపై ప్రభావం చూపుతోంది. ఇది ఉద్యోగాలను తగ్గించే ముప్పు మాత్రమే కాదు, ఏఐ నైపుణ్యాలు సాధించినవారికి కొత్త అవకాశాలను తెరుస్తోంది.
కోడింగ్‌లో అధునాతన ’కోలాబరేటర్’గా..
ఓపెన్‌ఏఐ విడుదల చేసిన జీపీటీ–5, మునుపటి మోడల్స్‌కు మించి, కోడింగ్‌లో ’స్టేట్–ఆఫ్–ది–ఆర్ట్’ పనితీరును చూపిస్తోంది. ఇది కేవలం కోడ్ జెనరేట్ చేయడమే కాకుండా, బగ్ ఫిక్సింగ్, కాంప్లెక్స్ కోడ్‌బేస్‌లను అర్థం చేసుకోవడం, ఎండ్–టు–ఎండ్ టాస్క్‌లను హ్యాండిల్ చేయడంలో గణనీయంగా మెరుగుపడింది. WE-bench Verified బెంచ్‌మార్క్‌లో 74.9% స్కోర్ సాధించడం, మునుపటి ఓ3 మోడల్ (69.1%) కంటే బాగుంది. ఇది 22% తక్కువ టోకెన్‌లు, 45% తక్కువ టూల్ కాల్స్‌తో పని చేస్తుంది. ఇందులో ’వైబ్ కోడింగ్’ ఫీచర్ కీలకం – సింపుల్ నాచురల్ లాంగ్వేజ్ ప్రాంప్ట్‌లతో కస్టమ్ ఇంటరాక్టివ్ అప్లికేషన్లను జెనరేట్ చేస్తుంది. ఫ్రంట్–ఎండ్ యూఐ డిజైన్‌లో మినిమల్ ప్రాంప్టింగ్‌తో 70% సమయాల్లో మెరుగైన ఫలితాలు ఇస్తుంది. ఇది టూల్ కాలింగ్‌లో మెరుగైనది – డజన్ల సంఖ్యలో టూల్ కాల్స్‌ను సీక్వెన్స్‌లో లేదా పారలల్‌గా హ్యాండిల్ చేస్తుంది, ఎర్రర్‌లను మేనేజ్ చేస్తుంది. చాట్‌జీపీటీలో డిఫాల్ట్ మోడల్‌గా ఇప్పుడు అందుబాటులో ఉంది, ప్లస్, ప్రో, టీమ్, ఫ్రీ యూజర్లకు యాక్సెస్ ఉంది. ఈ మార్పులు కోడింగ్‌ను మరింత ఈజీగా మార్చాయి.
ఏఐ బూమ్‌తో కోడింగ్ డిమాండ్ మార్పు..
కోడింగ్ బూమ్ 2000లలో మొదలై, మిలియన్ల మందికి ఉద్యోగాలు, ఆదాయాలు తెచ్చింది. కానీ ఏఐ రాకతో, డిమాండ్ షిఫ్ట్ అయింది – ఇప్పుడు ఏఐపై పట్టు ఉన్నవారికే అవకాశాలు. ప్రస్తుతం 30% మంది సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ మాత్రమే ఏఐ నైపుణ్యాలు సాధించారు, మిగిలినవారు అడాప్ట్ కావాల్సి ఉంది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకారం, 2026 నాటికి కంపెనీ కోడ్‌లో 50% ఏఐ రాసినది అవుతుంది. జీపీటీ–5 ఈ ట్రెండ్‌ను వేగవంతం చేస్తోంది. ఇది కోడ్ జెనరేషన్, మోడర్నైజేషన్, క్వాలిటీ ఇంజినీరింగ్‌లో మెరుగైనది, రివ్యూ సైకిల్స్‌ను కంప్రెస్ చేస్తుంది. ఫలితంగా, రూటిన్ కోడింగ్ జాబ్స్ (వెబ్ డెవలప్‌మెంట్ వంటివి) తగ్గే అవకాశం ఉంది.
క్లౌడ్ కోడ్ కర్సర్‌కు ప్రత్యామ్నాయంగా..
కర్సర్ ఏఐ కోడింగ్ టూల్‌గా పాపులర్‌గా ఉంది, కానీ జీపీటీ–5 దానికి బలమైన ప్రత్యామ్నాయంగా మారుతోంది. కర్సర్‌లోనే జీపీటీ–5 ఇంటిగ్రేట్ అయింది. డెవలపర్లు దీన్ని ’స్మార్టెస్ట్ మోడల్’గా పిలుస్తున్నారు – టూల్ కాలింగ్ ఎర్రర్ రేట్ అర్ధం అయింది, ఫ్రంట్–ఎండ్ పెర్ఫార్మెన్స్ టాప్. కర్సర్ టీమ్ ప్రకారం, జీపీటీ–5 ‘రిమార్కబ్లీ ఇంటెలిజెంట్, ఈజీ టు స్టీర్’ పర్సనాలిటీ కలిగి ఉంది. కానీ కొందరు క్లాడ్ 4.1 (అంథ్రోపిక్)ను ఇంకా ప్రిఫర్ చేస్తున్నారు – ఇది డిజైన్–ఫోకస్డ్, టూల్ యూజ్‌లో మెరుగు. జీపీటీ–5 ’ఫాస్ట్’ వెర్షన్ మీడియం రీజనింగ్‌తో వేగవంతం, కానీ హై రీజనింగ్ వెర్షన్ కాంప్లెక్స్ టాస్క్‌లకు బెటర్. మొత్తంగా, జీపీటీ–5 కోడింగ్ ఆటోమేషన్‌ను 65% నుండి 72%కి పెంచింది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లపై ప్రభావం..
జీపీటీ–5తో కోడింగ్‌తో రొటీన్ టాస్క్‌లు (బాయిలర్‌ప్లేట్ కోడ్, సింపుల్ డీబగ్గింగ్) ఆటోమేట్ అవుతాయి. ముఖ్యంగా వెబ్ డెవలప్‌మెంట్‌లో. డెవలపర్లు చెబుతున్నారు: ‘ఇది బేర్‌లీ ఇంప్రూవ్‌మెంట్, రీప్లేస్ చేయదు‘ అయితే కూడా, హాల్యుసినేషన్‌లు, అసంపూర్ణ కోడ్‌లు ఇంకా సమస్యలు. మానవ్ ఇంజినీర్లు లెర్నింగ్, అజమ్షన్స్ జస్టిఫై చేయడంలో మెరుగు. కానీ పాజిటివ్‌గా, ఇది ప్రొడక్టివిటీని పెంచుతుంది – ఇంజినీర్లు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, ఆర్కిటెక్చర్ డిజైన్‌పై ఫోకస్ చేయవచ్చు.