OG benefit shows Tickets Price: మరో వారం రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఓజీ(They Call Him OG) చిత్రం విడుదల కాబోతున్న సందర్భంగా నిర్మాతల కోరిక మేరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్స్ ని పెంచుతూ ఒక జీవో ని జారీ చేసింది. బెనిఫిట్ షోస్ కి వెయ్యి రూపాయిల టికెట్ రేట్స్ పెట్టగా, రెగ్యులర్ షోస్ లో సింగిల్ స్క్రీన్స్ కి 272 రూపాయిలు, మల్టీప్లెక్స్ షోస్ కి 327 రూపాయిలు పెంచుతూ జీవో ని జారీ చేశారు. అయితే బెనిఫిట్ షోస్ కి వెయ్యి రూపాయిలు పెట్టడం పై వైసీపీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని తన సినిమాల కోసం అధికార దుర్వినియోగం చేస్తున్నాడు అంటూ ఆయన పై మీడియా ముందుకొచ్చి మండిపడుతున్నారు. స్టార్ హీరోల సినిమాలకు బెనిఫిట్ షోస్ టికెట్ రేట్స్ పెంచడం కొత్తేమి కాదు.
ఎన్నో ఏళ్ళ నుండి ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వం లో కక్ష్య సాధింపుల చర్యల కారణంగా టికెట్ రేట్స్ భారీ గా తగ్గించడం వంటివి జరిగాయి. అసలు బెనిఫిట్ షోస్ అనేవే ఉండేవి కాదు. ఆ తర్వాత ఇండస్ట్రీ మొత్తం కలిసి అప్పటి సీఎం జగన్ ని వెళ్లి కలిస్తే టికెట్ రేట్స్ పెంచుకునే వెసులుబాటు కల్పించారు. కానీ అవి పవన్ కళ్యాణ్ సినిమాలకు వర్తించేవి కాదు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతీ హీరో సినిమాకు ఎంత కోరితే అంత టికెట్ రేట్స్ ఇచ్చింది. ‘దేవర’ , ‘పుష్ప 2’ చిత్రాల బెనిఫిట్ షోస్ కి కూడా టికెట్ రేట్స్ ని పెంచుకునే అవకాశం కల్పించారు. కానీ అప్పుడు వైసీపీ శ్రేణులు ఒక్కరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే వైసీపీ నాయకులూ ఒక్కొకరుగా క్యూలు కట్టి మీడియా ముందుకు వచ్చేస్తారు అంటూ పవన్ అభిమానులు మండిపడుతున్నారు.
సినిమా అనేది వినోదం. ఆసక్తి ఉన్న వాళ్ళు వెళ్తారు, లేదంటే ఓటీటీ లోకి వచ్చినప్పుడు చూసుకుంటారు. నిత్యావసర సరుకు కాదు కాబట్టి ఈ ఏ నిర్మాత ఎంత బడ్జెట్ ఖర్చు చేస్తే అంత బడ్జెట్ కి తగ్గట్టుగా టికెట్ రేట్స్ పెంచుకుంటారు. ఇప్పుడు ఒక బట్టల దుకాణం కి వెళ్తాము, అక్కడ వంద రూపాయలకు దొరికే బట్టలు ఉంటాయి, 10 వేల రూపాయలకు దొరికే బట్టలు కూడా ఉంటాయి. ఎవరికి ఇష్టమైనది వాళ్ళు కొనుక్కుంటారు. నువ్వు కచ్చితంగా 10 వేల రూపాయిల బట్టలే కొనాలని వాళ్ళు బలవంతం చేయడం లేదు కదా. సినిమా కూడా అంతే, వెయ్యి రూపాయిలు పెట్టి బెనిఫిట్ షోస్ టికెట్ కొనడానికి ఇష్టపడని వాళ్ళు, మాములు రేట్స్ ఉన్నటువంటి రెగ్యులర్ షోస్ కి వెళ్తారు. దీనికి ఇంతటి రాద్ధాంతం చేయడం ఎందుకు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు సైతం మండిపడుతున్నారు.