Google Gemini Nano Banana AI: ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పెద్దల ద్వారా కొన్ని ప్రత్యేక విషయాలను తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు చేతిలో మొబైల్ ఉండి.. దానికి ఇంటర్నెట్ ఉంటే ప్రపంచంలో ఏ విషయమైనా ఇట్లే తెలిసిపోతుంది. దీంతో చాలామంది ప్రపంచానికి అనుగుణంగా వారి జీవన శైలిని మార్చుకుంటున్నారు. ఇదే సమయంలో కొత్త కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో వాటిని ఫాలో అవుతున్నారు. తాజాగా 3d టెక్నాలజీతో తయారయ్యే ఫోటోలపై అందరి దృష్టిపడింది.. ప్రతి ఒక్కరూ తమ ఫోటోలను 3d లాగా మార్చుకొని స్టేటస్ లాగా పెట్టుకుంటున్నారు. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే?
గూగుల్ నుంచి వచ్చిన Gemini Ai వినియోగదారుల కోసం కొత్త ట్రెండును తీసుకొచ్చింది. ఎవరైనా తమ ఫోటోలను 2డి లేదా త్రీడీ లాగా మార్చుకొని స్టేటస్ లో పెట్టుకోవచ్చు. అయితే ఈ ఫోటోలు రియల్ గా కనిపించడంతో చాలామందికి ఆసక్తి పెరిగింది. ఒకరిని చూసి మరొకరు తమ ఫోటోలను ఇలా మార్చుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అయితే దీనిని ఎలా తయారు చేయాలంటే?
గూగుల్ లోకి వెళ్లి Gemini AI అనే వెబ్సైట్లోకి వెళ్లాలి. ఇక్కడ పైన ఉన్న ట్రై నానో బనానా అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఫోటో అప్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై ప్రెస్ చేసి గ్యాలరీలో ఉన్న ఫోటోను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రాంప్ట్ ఇస్తే 3d మోడల్ ఫోటో రెడీ అవుతుంది. దీంతో ఈ ఫోటోలను స్టేటస్ లో పెట్టుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI)అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలా డిఫరెంట్ ఫోటోలను తయారు చేసుకోవడంపై చాలామందికి ఆసక్తి పెరిగింది. ఇదివరకు ఏఐ గిబ్లి ఫోటోలతో సందడి చేశారు. ఈ యాప్ లో తమ ఫోటోలను అప్లోడ్ చేసి కాటు లాగా మార్చుకొని సోషల్ మీడియాలో సందడి చేశారు. ఇప్పుడు 3d ఫొటోస్ తో ఆకట్టుకుంటున్నారు.
అయితే కొందరు చెబుతున్న ప్రకారం తమ పర్సనల్ ఫొటోస్ ఇలా అప్లోడ్ చేయడం విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ యాప్ యూస్ చేసినప్పుడు గ్యాలరీ ఆక్సిస్ అడుగుతుంది. దీంతో పర్సనల్ ఫొటోస్ ఇతరులు దోచుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా 3d క్రియేట్ చేసేటప్పుడు వివరాలు అందించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో పర్సనల్ డీటెయిల్స్ కూడా ఇతరులకు వెళ్లే అవకాశం ఉంది. ఏదైనా అవసరం ఉంటేనే యాప్స్ యూస్ చేయాలి. సరదా కోసం చేసే కొన్ని యాప్స్ సమస్యలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.
అయితే కొందరు ఇది ట్రెండీ అనుకున్న కూడా.. కుటుంబ సభ్యుల ఫోటోలను అప్లోడ్ చేయడం ద్వారా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. యూత్ ఇతరులను ఆకర్షించడానికి ఇలాంటి ఫోటోలను ఎక్కువగా వాడుతున్నారు. పర్సనల్ ఫోటోలను అప్లోడ్ చేయొద్దని కొందరు సూచిస్తున్నారు.