Pitru Paksha 2025 dates: భాద్రపద మాసం రాగానే మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయని చెబుతూ ఉంటారు. వీటిని పితృపక్షాలు అని కూడా పేర్కొంటారు. పది ఏడాది భాద్రపద పౌర్ణమి గడిచిన తర్వాత ఇవి ప్రారంభమవుతాయి. 15 రోజులపాటు కొనసాగి మహాలయ అమావాస్యతో ముగుస్తాయి. 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 8 నుంచి 21 వరకు మహాలయ పక్షాలు కొనసాగానున్నాయి. ఈరోజుల్లో ప్రతి ఇంట్లో గతించిన వారికోసం ప్రత్యేకంగా పూజలు చేసి.. వారి పేరిట శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. కేవలం తండ్రి మాత్రమే కాకుండా అంతకుముందు వారి పేరిట కూడా పూజలు నిర్వహించి దానధర్మాలు చేయడం వల్ల వారు ఎంతో సంతోషిస్తారని చెబుతారు. ఇలా చేయడం వల్ల వారి నుంచి విముక్తి కూడా కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. అయితే ఇలా పితృపక్షాలు ఎలా ప్రారంభమయ్యాయి? వీటి వెనుక ఉన్న కథ ఏంటి?
పితృపక్షాల ప్రారంభానికి మహాభారతం తో సంబంధం ఉంది. మహాభారతంలో కర్ణుడి గురించి చదివే ఉంటారు. దానధర్మాలు చేసిన ఆయన స్వర్గానికి వెళ్తాడు. అతడు తన కవచకుండలను దానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. దీంతో అతనికి వజ్ర వైఢూర్యాలు అక్కడ కనిపిస్తాయి. కానీ తినడానికి ఆహార, పానీయాలు ఉండవు. దీంతో యువధర్మరాజును ప్రార్థిస్తాడు. అప్పుడు యమ ధర్మరాజు ప్రత్యక్షమై నీవు బతికి ఉన్నప్పుడు అన్ని దానం చేశావు.. కానీ ఆహార పానీయాలను ఎవరికి దానం చేయలేదు.. అందుకే నీకు ఇక్కడ లభించడం లేదు అని చెబుతాడు. ఇది ఇలాగ ఉండగా మహాభారత యుద్ధంలో చనిపోయిన వారందరూ తమకు సంబంధించిన వారు తిలోదకాలు ఇస్తారు. అటు కౌరవులు, ఇటు పాండవుల పేర్లు చెప్పగానే.. వారికి సంబంధించిన వారు తిలోదకాలను వదులుతారు. కర్ణుడు పేరు చెప్పగానే ఎవరు ముందుకు రారు. దీంతో అక్కడే ఉన్న కుంతీ దేవి కర్ణుడు నా పుత్రుడు అని నిజం చెబుతుంది. అప్పుడు ధర్మరాజు మాట్లాడుతూ ఎంత పని చేశావు.. కర్ణుడు నా పెద్ద కొడుకు.. అతడు ఉండగా.. సింహాసనం నాకు ఇప్పిచ్చావు అని అంటాడు.. ఇంతటి రహస్యం దాగడం వల్ల ఎంతో ఉపద్రవం జరిగింది.. అందుకే ఇప్పటి నుంచి ఆడవారి నోటిలో నువ్వు గింజ నానినంతసేపు నిజం నిలబడుగాక.. అని అంటాడు.
దీంతో కర్ణుడు తనకు ఎవరూ లేరని తెలుసుకొని యమధర్మరాజును ఒక కోరిక కోరుతాడు. స్వామి నాకు ఎవరూ లేరు.. కొన్ని రోజులపాటు నాకు అవకాశం ఇస్తే కిందికి వెళ్లి ఉపకారాలు చేసి వస్తా అని.. వరం కోరుతాడు. కర్ణుడి దయాగుణానికి యమధర్మరాజు కరిగిపోతాడు. అలా కర్ణుడు భాద్రపద మాసం కృష్ణపక్ష పాడ్యమి రోజున కిందికి వచ్చి 15 రోజులపాటు ఎంతోమందికి అన్న పానీయాలు దానం చేసి వెళ్తాడు. అంతేకాకుండా మరోసారి యమధర్మరాజును పిలిచి.. నాలాగా ఎంతోమంది ఎవరూ లేనివారు శరీరాన్ని విడిచి ఇక్కడికి వస్తారో.. వారికి ఈ 15 రోజుల్లో ఎవరు శ్రాద్ధ కర్మలు నిర్వహించినా.. వారికి వర్తించేలా చేయండి స్వామి అని అడుగుతాడు. అలాగే కొందరు చనిపోయిన తిథి తెలియకపోతే ఈ 15 రోజుల్లో శ్రాద్ధ కర్మలు నిర్వహించినా.. వారికి వర్తించేలా చేయమని కోరుతాడు. అందుకు యమధర్మరాజు సరే అంటాడు.
అందువల్ల అప్పటి నుంచి భాద్రపద మాసంలో మహాలయ అమావాస్యకు ముందు 15 రోజులు కుటుంబంలో గతించిన వారి కోసం శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే ప్రతిఫలం ఉంటుందని భా