Snoring: ప్రస్తుత కాలంలో అనేక రకాల ఆహార పదార్థాలను తినాల్సి వస్తుంది. అలాగే కలుషితనీరు తాగాల్సి వస్తుంది. ఒక్కోసారి మనం ఎంత శుభ్రంగా ఉన్నా బయటకు వెళ్లేసరికి కొన్నిచోట్ల అపరిశుభ్రమైన వాతావరణం ఉంటుంది. దీంతో కలుషితమైన గాలిని పీల్చుకున్న కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే అని అనిపించినా.. వీటిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడాల్సి వస్తుంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలో గురక ఒకటి. కొంతమందికి రాత్రి సమయంలో గురక వస్తుంది. కానీ దీనిని నిర్లక్ష్యం చేస్తారు. ఈ గురక సమస్య ఉన్నవారికి ఎలాంటి వ్యాధులు వస్తాయో తెలుసా?
సాధారణంగా వయసు పైబడిన వారికి శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరికి సరైన శ్వాస అందక గురక పెడుతూ ఉంటారు. అయితే ఈ గురక వయసు తక్కువగా ఉన్న వారిలో కూడా ఉంటుంది. వీరికి ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు లేదా జ్వరం వచ్చినప్పుడు మాత్రం వస్తుంది. ఆ తర్వాత రాకపోతే సమస్య లేదు. కానీ కంటిన్యూగా గురక వస్తుండడం.. అది కూడా బిగ్గరగా వస్తుంటే దానిపై ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు అని అంటున్నారు. ఎందుకంటే ఇలా బిగ్గరగా గురక వస్తుందంటే అది స్లీప్ ఆసియాకు సంకేతం అని అంటున్నారు. ఈ పరిస్థితి ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించడం మేలని అంటున్నారు.
ఎందుకంటే ఇలా బిగ్గరగా గురక వస్తుంది అంటే శ్వాస నాళాల్లో ఏదో సమస్య ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే గుండెకు తగిన శ్వాస అందకపోవచ్చు. గుండెకి అవసరమైన ఆక్సిజన్ అందకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అనేక రకాల ఆహార పదార్థాలు తినడం.. కలుషిత వాతావరణం లో ఉండడం వల్ల వయసు తక్కువగా ఉన్న వారిలోనూ ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల గురక విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకవేళ గురక సమస్య నుంచి బయటపడాలంటే బరువు తగ్గాలి. బరువు ఎక్కువగా ఉన్న వారిలో గురక సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్రీతింగ్ మాస్కులు కూడా వాడితే మంచిది. లేదా గురక తో బాధపడుతున్నారు అంటే వాకింగ్ చేయడం ఇంకా మంచిది. వాకింగ్ తో పాటు యోగ చేయడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినట్లు అవుతుంది. అంతేకాకుండా ఎక్కువగా కాలుష్య వాతావరణం లో పనిచేసేవారు ప్రతిరోజు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఉదయం స్వచ్ఛమైన వాతావరణం లో కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. ఇలా ప్రత్యేకంగా ఆరోగ్య రక్షణలు తీసుకున్న కూడా వైద్యులను సంప్రదించడం మంచిది అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.