Google Chrome News : గూగుల్ క్రోమ్ లో ఉన్న ఈ కొత్త ఫీచర్ గురించి మీకు తెలుసా?

వార్తల నుంచి మొదలుపెడితే సినిమా విశేషాలు దాకా.. వాతావరణం నుంచి మొదలు పెడితే బంగారం ధరల దాకా ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే దాకా చాలామంది ప్రయాణం గూగుల్ క్రోమ్ తోనే సాగుతుంది. అంతగా మన జీవితాలతో అది పెనవేసుకుపోయింది. మొదట్లో సెర్చ్ ఇంజన్ లాగానే మనకు పరిచయమైన గూగుల్ క్రోమ్.. తర్వాత మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది.

Written By: NARESH, Updated On : September 8, 2024 5:27 pm

Google Chrome News

Follow us on

Google Chrome News : గూగుల్ క్రోమ్ ను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఉపయోగిస్తుంటారు. సాధారణ గూగుల్ సెర్చ్ ఇంజన్ తో పోల్చితే.. గూగుల్ క్రోమ్ అత్యంత వేగంగా పనిచేస్తుంది. పైగా దీంట్లో మల్టీ విండో, మల్టీ టాబ్ ఫీచర్ యూజర్లకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. ఇవి మాత్రమే కాకుండా గూగుల్ క్రోమ్ లో మనకు తెలియని ఫీచర్లు చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైనది గూగుల్ క్రోమ్ లో వార్తలు వినడం.. బహుశా ఈ ఫీచర్ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. వాస్తవానికి మనలో చాలామందికి వార్తలు లేదా ఇతర సమాచారం కోసం వివిధ వెబ్సైట్లను చూడడం అలవాటు. కొంతమందికి అందులో ఉన్న కంటెంట్ చదవడం అలవాటు. అనివార్య పరిస్థితుల్లో చదివే అవకాశం లేనప్పుడు.. చాలామందికి కంటెంట్ చదివి వినిపిస్తే బాగుండు అనిపిస్తుంది. అయితే అలాంటి వారికి గూగుల్ క్రోమ్లో సరికొత్త ఫీచర్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ద్వారా గూగుల్ క్రోమ్ వాడేవారికి ఇది మరింత ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల వెబ్ పేజీలు చదవాల్సిన శ్రమ లేకుండా.. క్రోమ్ బ్రౌజర్ వార్తలను ఏం చక్కా చదివి వినిపిస్తూ ఉంటుంది.

లిసన్ టు దిస్ పేజీ

వాస్తవానికి మనలో చాలామందికి సుదీర్ఘ వ్యాసం చదవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటివారికి గూగుల్ క్రోమ్ లో “లిజన్ టు దిస్ పేజీ” అనే సదుపాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ముందుగా ఇది ఇంగ్లీష్ భాషకే పరిమితమైంది. ఇప్పుడు తెలుగు భాషకు కూడా ఈ ఫీచర్ ను గూగుల్ విస్తరించింది. ఈ ఫ్యూచర్ ద్వారా మనకు నచ్చిన కంటెంట్ ఎంచక్కా హెడ్ ఫోన్స్ పెట్టుకుని హాయిగా వినొచ్చు. ఉదాహరణకు ఓకే తెలుగు వెబ్ సైట్ లో ఇప్పుడు మీరు చదువుతున్న వార్తను వినాలి అనుకుంటే మీరు మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్లాలి. అక్కడ మూడు చుక్కల మెనుపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత లిజన్ టు దిస్ పేజ్ అనే ఐచ్చికాన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆ పేజీలో ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని గూగుల్ వాయిస్ అసిస్టెంట్ చదివి వినిపిస్తూ ఉంటుంది.

ఆ సౌకర్యం కూడా ఉంది

గూగుల్ వాయిస్ అసిస్టెంట్ టెక్స్ట్ మొత్తాన్ని చదువుతున్నప్పుడు.. అది ఏ పేరా చదువుతుందా కూడా మనకు స్పష్టంగా దర్శనమిస్తుంది. అది ఒకలా చూడాలి అనుకుంటే ఆడియో ఫాస్ట్ ఫార్వర్డ్/ బ్యాక్ ఫార్వర్డ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. మేల్ ఫిమేల్ వాయిస్ కూడా మార్చుకునే సౌలభ్యం ఉంది. ఒకవేళ దీనిని వేగంగా వినాలి అనుకుంటే 1x , 1.5x, 2x ఇలా స్పీడును నిర్ణయించుకోవచ్చు. ఒకవేళ మధ్యలో ఎవరితోనైనా ఫోన్ మాట్లాడాలి అనుకుంటే పాజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్లీ ప్లే చేసుకోవచ్చు. వినే సమయంలో స్క్రీన్ ఆన్ లో ఉంచాల్సిన పని లేదు..బ్యాక్ గ్రౌండ్ లో కూడా ప్లే చేసుకోవచ్చు. అంతే కాదు, గూగుల్ క్రోమ్ లో లిజన్ టు దిస్ ఫీచర్ ద్వారా హై ఎండ్ క్వాలిటీ సౌండ్ ను ఆస్వాదించవచ్చు.