https://oktelugu.com/

Gabbar Singh : ఆ ఒక్క విషయంలో ‘మురారి’ ని బీట్ చేయలేకపోయిన ‘గబ్బర్ సింగ్’..కానీ పవన్ కళ్యాణ్ పవర్ కి దండం పెట్టాల్సిందే!

నేటి తరం జనాలు మొత్తం థియేటర్ లో చూసారు, పైగా ప్రస్తుతం ఉన్న ఆడియన్స్ మైండ్ సెట్ కి ఈ చిత్రం అవుట్ డేటెడ్. అయినప్పటికీ కూడా కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవర్ వల్ల ఇంతటి ఘన విజయం సాధించింది ఈ చిత్రం. అంతే కాదు నాని 'సరిపోదా శనివారం' చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడం వల్ల ఈ సినిమాకి నైజాం ప్రాంతంలో చాలా తక్కువ షోస్ పడ్డాయి.

Written By:
  • Vicky
  • , Updated On : September 8, 2024 / 05:41 PM IST

    Gabbar Singh

    Follow us on

    Gabbar Singh Re Release : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ క్రేజ్ తో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో భారీగా వర్షాలు, వరదలు వచ్చినప్పటికీ కూడా ఈ సినిమాకి మొదటి రోజు అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కేవలం మొదటి రోజే 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని, అప్పటి వరకు ఆల్ టైం ఇండియన్ రికార్డు గా ఉన్నటువంటి తమిళ హీరో విజయ్ ‘గిల్లీ’ రికార్డ్స్ ని బద్దలు కొట్టిందని అంటున్నారు. సాధారణంగా రీ రిలీజ్ చిత్రాలను వీకెండ్ లో విడుదల చేస్తూ ఉంటారు, కానీ గబ్బర్ సింగ్ చిత్రాన్ని సోమవారం రోజు విడుదల చేశారు.

    ఆ రోజు పనిదినం అయినప్పటికీ, బయట తిరగలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ రేంజ్ ఓపెనింగ్ రావడం పవర్ స్టార్ పవర్ ఏంటో అందరికీ అర్థం అయ్యేలా చేస్తుంది. అయితే మురారి కి ఉన్న సౌకర్యాలు, పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి లేకపోవడం వల్ల లాంగ్ రన్ లో మురారి ని బుక్ మై షో టికెట్ సేల్స్ విషయం లో అధిగమించలేకపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘మురారి’ కి భారీ వీకెండ్ కలిసిరాగా ఫుల్ రన్ లో బుక్ మై షో యాప్ లో అమ్ముడుపోయిన టిక్కెట్లు 2 లక్షల 57 వేలు. కానీ గబ్బర్ సింగ్ చిత్రానికి మొదటి రోజు + ప్రీమియర్ షోస్ కలిపి 2 లక్షల 40 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అంటే మురారి చిత్రానికి క్లోసింగ్ మొత్తం లో అమ్ముడుపోయిన టిక్కెట్లు, గబ్బర్ సింగ్ చిత్రానికి కేవలం మొదటిరోజే అమ్ముడుపోయింది. ఇది అరాచకం అని అనకుండా ఇక ఏమని అంటారు. పైగా మురారి చిత్రం వింటేజ్ ఆల్ టైం క్లాసిక్ మూవీ. ఈ సినిమాని నేటి తరం మహేష్ అభిమానులు ఒక్కరు కూడా థియేటర్ లో చూసుండరు. అందుకే ఈ చిత్రానికి మహేష్ అభిమానులతో పాటు, మామూలు ఆడియన్స్ కూడా థియేటర్స్ కి కదిలి చూసారు. కానీ ‘గబ్బర్ సింగ్’ పరిస్థితి వేరే. ఈ సినిమా విడుదలై కేవలం 12 ఏళ్ళు మాత్రమే అయ్యింది.

    నేటి తరం జనాలు మొత్తం థియేటర్ లో చూసారు, పైగా ప్రస్తుతం ఉన్న ఆడియన్స్ మైండ్ సెట్ కి ఈ చిత్రం అవుట్ డేటెడ్. అయినప్పటికీ కూడా కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవర్ వల్ల ఇంతటి ఘన విజయం సాధించింది ఈ చిత్రం. అంతే కాదు నాని ‘సరిపోదా శనివారం’ చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడం వల్ల ఈ సినిమాకి నైజాం ప్రాంతంలో చాలా తక్కువ షోస్ పడ్డాయి. మురారి చిత్రానికి నైజాం లో కేవలం మొదటి రోజున 600 షోస్ పడితే, గబ్బర్ సింగ్ చిత్రానికి కేవలం 330 షోస్ పడ్డాయి. ఇన్ని షోస్ తేడా ఉన్నా కూడా గబ్బర్ సింగ్ చిత్రం మొదటి రోజు టికెట్ అమ్మకాలకు, మురారి కి క్లోసింగ్ లో అమ్ముడుపోయిన టిక్కెట్లకు కేవలం 17 వేలు తేడా ఉండడం గమనార్హం.