Health Benifits : ఏబీసీ జ్యూస్ అంటే ఏంటి? ఇది చేసే మిరాకిల్స్ తెలిస్తే అసలు తాగకుండా ఉండరు!

ఏబీసీ జ్యూస్ వైరల్ అవుతుంది. దీంతో చాలా మంది ఈ జ్యూస్ అంటే ఏంటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటని తెగ వెతుకుతున్నారు. మరి డైలీ ఈ ఏబీసీ జ్యూస్ తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం.

Written By: NARESH, Updated On : September 8, 2024 4:51 pm

ABC Juice Benifits

Follow us on

Health Benifits : ఆరోగ్యంగా ఉండటంతో పాటు అందంగా ఉండాలని చాలా మంది జ్యూస్ లు తాగుతుంటారు. రోజు ఏదో ఒక జ్యూస్ తాగడం వల్ల చర్మం రంగు మారుతుంది. ఎంత నల్లగా ఉన్న వాళ్లు అయిన తెల్లగా కావడం పక్కా. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా ఏబీసీ జ్యూస్ వైరల్ అవుతుంది. దీంతో చాలా మంది ఈ జ్యూస్ అంటే ఏంటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటని తెగ వెతుకుతున్నారు. మరి డైలీ ఈ ఏబీసీ జ్యూస్ తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం.

ఏబీసీ జ్యూస్ అంటే?
ఆరోగ్యానికి మేలు చేసే ఆపిల్, బీట్రూట్, క్యారెట్ కలిపి తయారు చేసిన జ్యూస్ నే ఏబీసీ జ్యూస్ అంటారు. రోజు ఉదయం ఈ జ్యూస్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే రక్తం తొందరగా ఎక్కడంతో పాటు చర్మం కాంతివంతంగా మారుతుంది. రంగు తక్కువగా ఉన్నవాళ్లు రోజు ఈ జ్యూస్ తాగితే తప్పకుండా మారుతుంది. ఎలాంటి సమయంలో అయిన ముఖం మెరుస్తూనే ఉంటుంది. రోజులో ఒక్కసారి అయిన ఈ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

గుండె సమస్యలు
మూడింటిలో ఉండే పోషకాలు షుగర్ లెవెల్స్ ని నియంత్రిస్తాయి. దీని వల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. సమయం ఉంటే రోజు ఈ జ్యూస్ ని చేసి తాగితే బరువు తగ్గించడంతో పాటు.. ఫిట్ గా ఉండేలా చేస్తుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. అలాగే హిమోగ్లోబిన్ లెవెల్స్ ను తొందరగా పెంచుతుంది.

కిడ్నీ సమస్యలు
కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవాళ్లకి ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ తో కిడ్నీ సమస్యలు రాకుండా కూడా జాగ్రత్త పడవచ్చు.

జీర్ణ సమస్యలు
చాలా మంది ఈరోజుల్లి జీర్ణ సమస్యలతో బాధ పడుతున్నారు. ఇలాంటి వాళ్లు రోజు ఈ జ్యూస్ తాగితే తొందరగా సమస్య తగ్గుతుంది. అలాగే మలబద్ధకం, అజీర్ణం, కడుపు నొప్పి వంటి వాటి నుంచి కూడా విముక్తి పొందవచ్చు.

ఎలా చేయాలంటే?
ఇవే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. కళ్లు బాగా పని చేయడంలో సాయపడుతుంది. ఈ జ్యూస్ తాగిన కొన్ని రోజులకే చర్మం తెల్లగా అవుతుంది. తాగి చుస్తే.. రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు. రోజంతా యాక్టివ్ గా ఉండటానికి సహాయపడుతుంది. అయితే ఈ జ్యూస్ ని తయారు చేసుకోవడానికి ఒక ఆపిల్, బీట్రూట్, క్యారెట్ కావాలి. వీటిని బాగా మిక్సీ చేసి వడకట్టుకోవాలి. దీనిలో చుక్క నిమ్మ రసం, తేనే కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కొందరు అల్లం కూడా వేస్తారు. తాగడానికి మీకు ఎలా నచ్చితే అలా తయారు చేసుకోవచ్చు.
కు ఎలా నచ్చితే అలా తయారు చేసుకోవచ్చు.