https://oktelugu.com/

WhatsApp users : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈజీగా డాక్యుమెంట్ స్కానింగ్

ఇతర యాప్‌లలో డాక్యుమెంట్‌ను స్కాన్ చేసి పంపిస్తే ఎక్కువ సమయం పడుతుందనే ఉద్దేశంతో వాట్సాప్ డాక్యుమెంట్ స్కానింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. మరి ఈ ఫీచర్‌ యూజర్లకు ఎలా ఉపయోగపడుతుందో తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 25, 2024 / 01:15 PM IST

    WhatsApp users

    Follow us on

    WhatsApp users : ప్రస్తుతం అందరి దగ్గర స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. మొబైల్ ఉన్నవారు అసలు వాట్సాప్ లేకుండా ఉండరు. ప్రతీ ఒక్కరూ కూడా వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. నిజం చెప్పాంటే వాట్సాప్‌ లేనిదే అసలు ఈ రోజుల్లో ఏ పని కూడా జరగదు. సగం సంస్థలు కూడా వాట్సాప్‌లోనే పనులు చేస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా వాట్సాప్ వాడుతుంటారు. పొద్దున్న లేచిన నుంచి నిద్రపోయే వరకు ఎన్నిసార్లు ఓపెన్ చేస్తారో కూడా వాళ్లే తెలియదు. అంతా ఒక్కోరు వాట్సాప్‌కి ఎడిక్ట్ అయిపోయారు. అయితే యూజర్లను ఆకర్షించడానికి వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. యూజర్లను దృష్టిలో ఉంచుకుని అప్‌డేట్ చేస్తూనే ఉంది. అయితే కొందరు వాట్సాప్‌ను కేవలం మెసేజ్‌లకు మాత్రమే కాకుండా డాక్యుమెంట్లు పంపించేందుకు కూడా ఉపయోగిస్తుంటారు. ఈ డాక్యుమెంట్లను స్కానింగ్ చేయాలంటే వాట్సాప్‌లో కుదరదు. మళ్లీ వేరే ఇతర యాప్‌లో చేయాలి. ఇలా చేయాలంటే కాస్త ఇబ్బందిగా యూజర్లు ఫీల్ అవుతుంటారు. ఇలాంటి సమస్య లేకుండా.. యూజర్లు ఇంకా మంచి సేవలను అందించాలనే ఉద్దేశంతోనే కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఇతర యాప్‌లలో డాక్యుమెంట్‌ను స్కాన్ చేసి పంపిస్తే ఎక్కువ సమయం పడుతుందనే ఉద్దేశంతో వాట్సాప్ డాక్యుమెంట్ స్కానింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. మరి ఈ ఫీచర్‌ యూజర్లకు ఎలా ఉపయోగపడుతుందో తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.

    డాక్యమెంట్‌లను వాట్సాప్‌లో పంపించాంటే స్కానింగ్ చేసి, దాని సైజ్, క్వాలిటీ అన్ని మార్చుకుని ఇతరులకు పంపించాలి. ఇదంతా చేయడానికి ఇతర యాప్‌లు వాడటంతో పాటు కాస్త సమయం కూడా పడుతుంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వాట్సాప్ యూజర్ల కోసం ఈ డాక్యుమెంట్ స్కానింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ అనేది లేటెస్ట్ వెర్షన్ ఉన్న యాపిల్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మిగిలిన వారందరికీ కూడా త్వరలో అందుబాటులోకి రానున్నట్లు వాట్సాప్ తెలిపింది. అయితే వాట్సాప్‌లో ఎటాచ్‌మెంట్‌లో డాక్యుమెంట్ కనిపిస్తుంది. అందులో షేరింగ్ మెనూలో ఈ స్కాన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ సాయంతో డాక్యుమెంట్లను ఈజీగా స్కాన్ చేయవచ్చు. ప్రివ్యూ ఆప్షన్ కూడా ఉంటుంది. దీంతో ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే పంపించవచ్చు. ఈ ఫీచర్ వల్ల ఎక్కువ సమయం వృథా కాకుండా ఉండటంతో పాటు వేరే ఇతర యాప్‌లు కూడా మొబైల్‌లో ఎక్కించాల్సిన అవసరం లేదు. యూజర్లకు అనుకూలంగా ఉండేందుకు వాట్సాప్ ఈ డాక్యుమెంట్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనివల్ల యూజర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుకున్న వెంటనే డాక్యుమెంట్‌ను పంపించవచ్చు. యూజర్ల కోసం మోటా ఇలా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా యూజర్లు హ్యాపీగా యాప్‌ను వినియోగించాలనే ఉద్దేశంతో మెటా ఈ నిర్ణయం తీసుకుంది. మరి ఇంకా మున్ముందు ఎలాంటి కొత్త ఫీచర్లను తీసుకొస్తుందో చూడాలి.