https://oktelugu.com/

Chota K Naidu: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అందరికీ సన్ స్ట్రోక్ అయితే ఆయనకు మాత్రం మేనల్లుడి స్ట్రోక్ తగిలేలా ఉంది…

ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు తమ తనయులను ఇండస్ట్రీకి పరిచయం చేసే క్రమంలో తండ్రులంతా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. తమ కొడుకు కూడా తమలాగే పెద్ద హీరో అవ్వాలని కెరీర్ ను ఎంతో పక్కాగా ప్లాన్ చేసి మరి ముందుకు తీసుకొని వెళ్తారు. అలాంటప్పుడు ఒకవేళ సినిమా కనుక ఫ్లాప్ అయితే మాత్రం ఆ తండ్రులకు సన్ స్ట్రోక్ తప్పదు.

Written By:
  • Mahi
  • , Updated On : December 25, 2024 / 01:13 PM IST

    Chota K Naidu

    Follow us on

    Chota K Naidu: సినిమా ఇండస్ట్రీలో ప్రతి నటుడికి హిట్టు లేదా ప్లాప్ అనేది సహజమే. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో సన్ స్ట్రోక్ అనే మాట కామన్ గా వినిపిస్తుంది. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు తమ తనయులను ఇండస్ట్రీకి పరిచయం చేసే క్రమంలో తండ్రులంతా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. తమ కొడుకు కూడా తమలాగే పెద్ద హీరో అవ్వాలని కెరీర్ ను ఎంతో పక్కాగా ప్లాన్ చేసి మరి ముందుకు తీసుకొని వెళ్తారు. అలాంటప్పుడు ఒకవేళ సినిమా కనుక ఫ్లాప్ అయితే మాత్రం ఆ తండ్రులకు సన్ స్ట్రోక్ తప్పదు. ఇక అందరి నుంచి తండ్రి సూపర్ స్టార్ కానీ తనయుడు మాత్రం ఫెయిల్ అవుతున్నాడు అనే విమర్శలు కూడా ఎదుర్కోక తప్పదు. ఇది అన్ని ఇండస్ట్రీలో సర్వసాధారణం అని చెప్పొచ్చు. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే తల్లిదండ్రుల సపోర్ట్ అనేది కేవలం ఎంట్రీ వరకు మాత్రమే. ఇక తర్వాత సొంతంగా తమను తాము నిరూపించుకొని తమ టాలెంట్ తో పైకి రావాల్సి ఉంటుంది. స్టార్ హీరోల కొడుకులంతా తమ తండ్రి లాగానే సక్సెస్ అవ్వాలని లేదు. కేవలం వాళ్లకు ఉన్న ప్రతిభ మాత్రమే వాళ్లకు ప్రేక్షకులలో మంచి గుర్తింపును తీసుకొని వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోగా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రామ్ చరణ్ చిరంజీవి తనయుడిగా హీరోగా సక్సెస్ అవ్వలేదు. ప్రతి సినిమాకు ఎంతో కష్టపడి తనను తాను నిరూపించుకొని ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎదిగారు రామ్ చరణ్. ఇక అల్లు అరవింద్ కేవలం నిర్మాత మాత్రమే అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆయన తనయుడు అల్లు అర్జున్ నేడు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపును మరియు క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్ ఎదగడానికి ఒక్కో సినిమాకు ఎంతో కష్టపడ్డాడు. అంచలంచెలుగా ఎదుగుతూ తనని తానే స్టార్ గా మార్చుకున్నాడు అల్లు అర్జున్.

    ఇక ఇదే క్రమంలో నిర్మాత అల్లు అరవింద్ చిన్న తనయుడు అల్లు శిరీష్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ అల్లు శిరీష్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. ఇంకా అల్లు శిరీష్ స్టార్ గా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నాడని చెప్పచ్చు. ఇలా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో లేదా హీరోయిన్ల తనయుడుగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఫెయిల్ అయిన వాళ్లు కూడా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు.

    ఫేమస్ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయనకు సన్ స్ట్రోక్ తగలలేదు కానీ మేనల్లుడి స్ట్రోక్ మాత్రం తగిలేలా ఉంది అని అందరూ అంటున్నారు. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ చోటా కె నాయుడు మేనల్లుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే.

    సందీప్ కిషన్ తన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు సినిమా ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలతో తన మేనల్లుడిని సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు. సందీప్ కిషన్ హీరోగా ఇప్పటివరకు చాలా సినిమాలు చేశారు. బ్యాక్ అండ్ లో తన మేనల్లుడి కోసం చోటా కె నాయుడు పనిచేశారు అని చెప్పొచ్చు.

    సందీప్ కిషన్ సినిమా కెరియర్ లో ఇప్పటివరకు కొన్ని హిట్ సినిమాలతో పాటు కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటివరకు హీరో సందీప్ కిషన్ స్టార్ కాలేకపోయాడు. అయితే సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తన మేనల్లుడు కొన్ని సినిమాలు పరాజయం పొందడంతో నిరుత్సాహ పడుతున్నట్లు తెలుస్తుంది.