WhatsApp new feature : వాట్సప్ యూజర్లకు శుభవార్త.. అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చిన మెటా..

వాట్సాప్ లో త్వరలో "వాయిస్ చాట్ మోడ్ ఫర్ మెటా ఏఐ" ఫ్యూచర్ అందుబాటులోకి రానుంది. ఇది అందుబాటులోకి వస్తే వాట్సప్ యూజర్లు మెటా ఏఐతో వాయిస్ చాట్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా 10 విభిన్న వాయిస్ లు కలిగి ఉంటుంది. యూజర్లు ఎంపిక చేసుకున్న దాన్నిబట్టి ఆ వాయిస్ లోనే మెటా ఏఐ రిప్లై ఇస్తుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : ఆగస్ట్ 14, 2024 2:53 సా.

WhatsApp new feature

Follow us on

WhatsApp new feature : స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారికి వాట్సాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సందేశాలు, వీడియో కాల్స్, ఆడియో ఫైల్స్, వాయిస్ రికార్డింగ్, వీడియోలు, బ్యాంకింగ్ కార్యకలాపాలు, లొకేషన్ షేరింగ్.. ఇలా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. అందువల్లే ప్రపంచ వ్యాప్తంగా ఈ సోషల్ మీడియా యాప్ మూడు బిలియన్ లకు మించి యూజర్లను కలిగి ఉంది. అంతకంతకు యూజర్లను పెంచుకుంటూ పోటీ కంపెనీలకు సవాల్ విసురుతోంది. ఇతర కంపెనీలు వాట్సాప్ కు మించి యాప్ తయారు చేసేందుకు నానా తంటాలు పడుతున్నాయి. అయితే ఆ కంపెనీలకు అందనంత దూరంలో ఉంది మెటా. అద్భుతమైన ఫీచర్లను ఎప్పటికప్పుడు జోడించుకుంటూ వాట్సాప్ ను అత్యద్భుతంగా తీర్చి దిద్దుతోంది. ఈ క్రమంలోనే సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చినట్టు వాట్సప్ మాతృ సంస్థ మెటా ప్రకటించింది.

కొత్త ఫీచర్ ఏంటంటే..

వాట్సాప్ లో త్వరలో “వాయిస్ చాట్ మోడ్ ఫర్ మెటా ఏఐ” ఫ్యూచర్ అందుబాటులోకి రానుంది. ఇది అందుబాటులోకి వస్తే వాట్సప్ యూజర్లు మెటా ఏఐతో వాయిస్ చాట్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా 10 విభిన్న వాయిస్ లు కలిగి ఉంటుంది. యూజర్లు ఎంపిక చేసుకున్న దాన్నిబట్టి ఆ వాయిస్ లోనే మెటా ఏఐ రిప్లై ఇస్తుంది. ఈ వాయిస్ మెసేజ్ లను టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేసుకునే వెసలు బాటు కూడా ఉంది.. ఇంతకుముందు ఈ సదుపాయం ఉండేది కాదు. వాయిస్ మెసేజ్ టెక్స్ట్ రూపంలోకి మార్చుకోలేక యూజర్లు చాలా ఇబ్బందులు పడేవారు. గూగుల్ వాయిస్ కమాండ్ ద్వారా టెక్స్ట్ రూపంలో దానిని మార్చుకునేవారు. అయితే ఇకనుంచి ఆ ఇబ్బంది ఉండదు.

సరికొత్త అనుభూతి

వాయిస్ చాట్ మోడ్ ఫర్ మెటా ఏఐ ద్వారా యూజర్లకు సరికొత్త ఏఐ వాయిస్ చాట్ అనుభూతి లభిస్తుందని మెటా యాజమాన్యం చెబుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం అనేది ప్రస్తుత కాలంలో పెరిగిన నేపథ్యంలో.. విస్తృతమైన సేవలు అత్యంత త్వరగా అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని మెటా వివరిస్తోంది. ” మా యూజర్లకు మెరుగైన సేవలు అందించాలనేది మా లక్ష్యం. ఇప్పటికే మేము 3 బిలియన్లకు మించి యాక్టివ్ యూజర్లను కలిగి ఉన్నాం. ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.ప్రపంచవ్యాప్తంగా వాట్స్అప్ అంటే తెలియని వారు లేరు. అయితే దీనిని మరింత విస్తృతం చేసుకోవాలనేది మా ప్రణాళిక. ఇతర యాప్స్ పై ఉపయోగపడకుండా.. మొత్తం దీని ద్వారానే చేయాలనేది మా లక్ష్యం. ఆ దిశగానే మేము అడుగులు వేస్తున్నాం. కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను యూజర్లకు పరిచయం చేస్తున్నాం. మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం ప్రయోగాలు చేస్తోంది. భవిష్యత్తులో యూజర్ల కోసం మరిన్ని సదుపాయాలు తీసుకొస్తాం. కేవలం వాట్సప్ ద్వారానే అన్ని పనులు జరిగేలాగా రూపకల్పన చేస్తామని” మెటా యాజమాన్యం ప్రకటించింది.