https://oktelugu.com/

Samantha: సమంత ఆనందం కోసం భారీ శుభవార్త చెప్పిన అక్కినేని కుటుంబం..సంబరాల్లో ఫ్యాన్స్!

నాగ చైతన్య కంటే పది రెట్లు పెద్ద రేంజ్ కి వెళ్లాలని ఆమె అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'సిటాడెల్' విడుదలకు సిద్ధంగా ఉంది. సమంత తో 'ఫ్యామిలీ మెన్' రెండవ సీజన్ లో విలన్ రోల్ లో చూపించి భయపెట్టిన రాజ్ & డీకే ఈ చిత్రాన్ని నిర్మించారు.

Written By:
  • Vicky
  • , Updated On : August 14, 2024 / 03:01 PM IST

    Samantha

    Follow us on

    Samantha: సమంత తో నాగ చైతన్య పెళ్లి జరిగినప్పుడు లక్షలాది మంది అభిమానులు ఎంతలా సంతోషించారో, వాళ్లిద్దరూ విడిపోయిన తర్వాత అంతలా బాధపడ్డారు. వీళ్లిద్దరు విడిపోయి రెండేళ్ల పైనే గడుస్తున్నా, మళ్ళీ ఎలా అయిన వీళ్లిద్దరు కలిస్తే బాగుంటుంది అని అందరూ అనుకున్నారు, అభిమానులు ప్రార్థనలు చేసారు కూడా. కానీ నాగ చైతన్య ఆ అవకాశం లేదని రీసెంట్ గా ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకొని అభిమానులకు చెప్పకనే చెప్పాడు. మరోపక్క ఇన్నాళ్లు విడాకుల విషయం లో సమంతదే తప్పు అని సోషల్ మీడియా లో కామెంట్స్ చేసిన నెటిజెన్స్ మొత్తం నేడు ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

    ఇదంతా పక్కన పెడితే మరోపక్క సమంత అభిమానులు, ఆమెకి విడాకులు జరిగి చాలా మంచి జరిగింది అంటూ కామెంట్స్ చెప్పుకొచ్చారు. ఎందుకంటే సమంత సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ ఒక స్టార్ హీరో కి ఎంతటి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో , సమంత కి కూడా అంతే ఫాలోయింగ్ ఉంటుంది. కేవలం ఆమెని వెండితెర మీద చూసేందుకు లక్షలాది మంది థియేటర్స్ కి తరలివస్తుంటారు. పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్ రేంజ్ కి ఎదగాల్సిన సమంత, నాగ చైతన్య తో పెళ్లి కారణంగానే తగ్గాల్సి వచ్చింది అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఎవరికైనా కొన్ని పరిమితులు ఉంటాయి, అక్కినేని ఫ్యామిలీ లో అది మరీనూ!..అందుకే సమంత ఆ పరిమితులకు తగ్గట్టుగానే క్యారెక్టర్స్ ని ఎంచుకోవాల్సి వచ్చేది. దానివల్ల ఆమెకి పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో అద్భుతమైన ఆఫర్లు చేజారిపోయాయి. కానీ నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత స్వతంత్రురాలు అయ్యింది. ఆమెకి ఇష్టమొచ్చినట్టు బ్రతకొచ్చు, ఇష్టమొచ్చిన పాత్రలు చెయ్యొచ్చు. అడిగేవాళ్ళు ఎవ్వరూ లేరు, ఇప్పుడు సమంత కి పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్ అయ్యే అవకాశం వచ్చింది. తన జీవితం లో జరిగిన ఈ చేదు గాయాన్ని మర్చిపోయే విధంగా ఆమె కం బ్యాక్ ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు.

    నాగ చైతన్య కంటే పది రెట్లు పెద్ద రేంజ్ కి వెళ్లాలని ఆమె అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. సమంత తో ‘ఫ్యామిలీ మెన్’ రెండవ సీజన్ లో విలన్ రోల్ లో చూపించి భయపెట్టిన రాజ్ & డీకే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ ద్వారానే సమంత కి పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ లో పవర్ ఫుల్ రా ఏజెంట్ పాత్రలో ఆమె కనిపించబోతుంది. ఈ సిరీస్ కి సంబంధించిన టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చూడాలి మరి ఈ సిరీస్ ద్వారా సమంత ఏ రేంజ్ కి వెళ్లబోతుంది అనేది.