WhatsApp: వాట్సాప్ యూజర్స్ కు గుడ్ న్యూస్.. ఇక మీ ప్రైవసీకి ఢోకా లేకుండా కొత్త ఫీచర్.. అదెంటో తెలుసుకోండి..

తాజాగా వాట్సాప్ లో రెండు ప్రొఫైల్ ను సెట్ చేసుకోవచ్చని వెల్లడించింది. చాలా మంది ఉద్యోగులు పర్సనల్ విషయాలు కార్యాలయాల్లో తెలియవద్దని కోరుకుంటారు. కానీ కాంటాక్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రొఫైల్ ను చూసే అవకాశం ఉంటుంది.

Written By: Srinivas, Updated On : November 5, 2023 2:31 pm

WhatsApp

Follow us on

WhatsApp: వినియోగదారులకు అనుగుణంగా వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతీ మొబైల్ తో తప్పనిసరిగా వాట్సాప్ తప్పనిసరిగా ఉంటుంది. కమ్యూనికేషన్ లో వాట్సాప్ కు మించిన యాప్ లేదని కొందరి అభిప్రాయం. అందువల్ల స్కూల్ విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ వాట్సాప్ ను వాడుతూ ఉంటారు. టెక్ట్స్ మెసేజ్ నుంచి వీడియోల వరకు ఇతరులకు పంపిస్తూ తమ అవసరాలను తీర్చుకుంటారు. అయితే తాజాగా వాట్సాప్ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి వాట్సాప్ లో రెండు ప్రొఫైల్ ను పెట్టుకోవచ్చని తెలిపింది.

వాట్సాప్ ఇప్పటి వరకు వివిధ రకాల ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల ఫొటోలు, వీడియోలు క్వాలిటీ దెబ్బతినకుండా రిజల్యూషన్ సేమ్ ఉండే విధంగా పంపించుకునే వెసులుబాటును కల్పించింది. గతంలో ఫొటోలను వాట్సాప్ ద్వారా పంపిస్తే వాటి క్వాలిటీ దెబ్బతినేది. దీంతో చాలా మంది అసౌకర్యంగా ఫీలయ్యారు. ఈ నేపథ్యంలో హెచ్ డి ఫొటోలను పంపించే విధంగా ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే ఇటీవల వీడియోలు కూడా క్వాలిటీ దెబ్బతినకుండా 2 జీబీ వరకు పంపించుకోవచ్చని తెలిపింది.

తాజాగా వాట్సాప్ లో రెండు ప్రొఫైల్ ను సెట్ చేసుకోవచ్చని వెల్లడించింది. చాలా మంది ఉద్యోగులు పర్సనల్ విషయాలు కార్యాలయాల్లో తెలియవద్దని కోరుకుంటారు. కానీ కాంటాక్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రొఫైల్ ను చూసే అవకాశం ఉంటుంది. దీంతో కొందరు తమ ప్రైవసీని కోల్పోయి రకరకాల ఇబ్బందులకు గురయ్యారు. అయితే తమ ప్రొఫైల్ కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని కొన్ని కొశ్చన్ సైట్లలో కోరారు. వినియోగదారుల సమస్యను తెలుసుకున్న వాట్సాప్ వారికి అనుకూలంగా కొత్త ఫీచర్ ను తీసుకురానుంది.

కొత్త ఫీచర్ ప్రకారం యూజర్స్ ఒకే ఫొన్ నెంబర్ పై రెండు ప్రొఫైల్స్ పెట్టుకోవచ్చు. ఒకటి కుటుంబ సభ్యులకు, మరొకటి కార్యాలయాలకు కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. ఇలా ఉండడం వల్ల వారి ప్రైవసీ దెబ్బతినకుండా ఉంటుందని తెలిపింది. ఇప్పటికే ప్రైవసీ కోసం ఎండ్ టు ఎంట్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. దీని వల్ల కొన్ని మెసేజ్ లు ఎవరికి చేశారో వారికి తప్ప మిగతా వారికి కనిపించవు. ఇప్పుడు ప్రొఫైల్ విషయంలోనూ భద్రతగా ఉండొచ్చన్నమాట.