https://oktelugu.com/

Haryana: ఉద్యోగులకు కార్లు గిప్ట్ గా ఇచ్చేశాడు.. మీరయ్య ఓనర్లు.. ఉద్యోగుల పాలిట దేవుళ్లు..

హర్యానాలోని మిట్స్ హెల్త్ కేర్ అనే ఫార్మా ఉంది. ఈ కంపెనీ 2010లో ప్రారంభమైంది. ఇందులో వివిధ రకాల మెడిసిన్స్ తయారు చేస్తారు. యాంటిబయాటిక్స్, ఫార్మా స్యూటికల్ క్యాప్సూల్ ను తయారు చేస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : November 5, 2023 / 02:37 PM IST

    Haryana

    Follow us on

    Haryana: కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులను నిత్యం ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఉద్యోగుల పనితీరు బాగుంటేనే కంపెనీ లేదా సంస్థల మనుగడ సాధ్యమవుతుంది. ఉద్యోగులు తమ శక్తి, సామర్థ్యాలు ప్రదర్శించి సంస్థను ఉన్నత స్థితికి తీసుకెళ్లెందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కొన్ని సంస్థలు తమ ఉద్యోగునలు ఎంకరేజ్ చేసేందుకు వివిధ బహుమతులు అందిస్తుంటాయి. ఈ గిప్ట్ లు నగదు లేదా వస్తు రూపంలో ఏదైనా పండుగల సందర్భంలో అందిస్తుంటారు. నెలవారీ జీతం వచ్చినా ఆయా సందర్భాల్లో ఉద్యోగులకు ఇలాంటి గిప్ట్ లు ఇవ్వడం ద్వారా వారిలో ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అయితే ఓ కంపెనీ ఏకంగా కార్లను బహుమతిగా ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    హర్యానాలోని మిట్స్ హెల్త్ కేర్ అనే ఫార్మా ఉంది. ఈ కంపెనీ 2010లో ప్రారంభమైంది. ఇందులో వివిధ రకాల మెడిసిన్స్ తయారు చేస్తారు. యాంటిబయాటిక్స్, ఫార్మా స్యూటికల్ క్యాప్సూల్ ను తయారు చేస్తుంది. దీని వ్యవస్థాపకుడు ఎం.కె. బాటియా. ఈ కంపెనీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫైనాన్షియల్ గా అభివృద్ధి సాధించింది. అందుకు కారణం ఉద్యోగుల పనితీరునే అని, త్వరలోనే మీకు కార్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు పలు సందర్భాల్లో కంపెనీ సమావేశాల్లో ఆయన పేర్కొన్నట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు.

    ఇందులో భాగంగా దీపావళి సందర్భంగా 12 మంది ఉన్నతోద్యోగులకు కార్లను గిప్ట్ గా ఇచ్చారు. గతంలో పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే కార్లను బహుమతిగా ఇచ్చారు. ఢిల్లీలో ఓ వజ్రాల వ్యాపారి తమ ఉద్యోగులకు కార్లను ఇచ్చారు. కానీ తాజా ఓ ఫార్మ కంపెనీ కూడా తమ ఉద్యోగుల శ్రేయస్సు కోరుకుంటున్నామని యాజమాన్యం తెలిపింది. ఇందులో భాగంగానే వారిని ఆశ్చర్యపరిచే విధంగా కార్లను ఇచ్చినట్లు తెలిపారు. అతి త్వరలోనే మరో 38 మందికి కార్లను అందజేయనున్నట్లు ఎం.కె. బాటియా తెలిపారు.

    ఈ సందర్భంగా కార్లను తీసుకున్న ఉద్యోగులు సంతోషంగా కనిపించారు. అయితే ఇందులో కొందరు తమకు డ్రైవింగ్ రాదని చెప్పారు. ఈసందర్భంగా కారు పొందిన ఓ ఉద్యోగి మాట్లాడుతూ తాను ఎనిమిదేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి తమ డైరెక్టర్ కార్లు గిప్ట్ గా ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడని, ఆ కల నేడు నెరవేరిందని ఆనందంగా చెప్పాడు. ఈ గిప్ట్ అందుకోవడం ఎంతో ఇంప్రెస్ గా ఉందని చెప్పారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ‘మీరయ్య ఓనర్లు.. ఉద్యోగుల పాలిట దేవుళ్లు..’ అని కొనియాడుతున్నారు.