https://oktelugu.com/

WhatsApp users : వాట్సాప్ వినియోగదారులూ ఇక మెసేజ్ ఎడిట్ చేసుకోవచ్చు.. ఇలా చేయండి

కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్ తో ఏదైనా మనం పంపిన సందేశాన్ని 15 నిమిషాల్లో ఎడిట్ చేసుకునే వెసులుబాటు కల్పించనుంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 15, 2023 / 10:16 PM IST

    WhatsApp

    Follow us on

    WhatsApp users : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త కొత్త స్కీములు తీసుకొస్తోంది. దీంతో వినియోగదారులకు మరింత చేరువవుతోంది. ఈ మేరకు మరోమారు కొత్త యాప్ ను అందుబాటులోకి తెస్తోంది. పొరపాటున మనం పంపిన సందేశంలో ఏవైనా తప్పులుంటే దాన్ని డిలీట్ చేసుకునే అవకాశం ఉంది. గతంలో ఇది ఉండేది కాదు. తాజాగా మనం పంపిన సందేశంలో ఏవైనా తప్పులు ఉంటే దాన్ని సవరించుకుని తరువాత పంపించుకోవచ్చని వాట్సాప్ చెబుతోంది. దీని కోసం ఎడిట్ ఆప్షన్ తీసుకొచ్చింది.

    కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్ తో ఏదైనా మనం పంపిన సందేశాన్ని 15 నిమిషాల్లో ఎడిట్ చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. మనం పంపిన మెసేజ్ పై క్లిక్ చేసే కాసేపు హోల్డ్ లో పెట్టాలి. అప్పుడు కాపీ, ఎడిట్ అనే ఆప్షన్లు మనకు కనిపిస్తాయి. దీంతో ఎడిట్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. ఒకసారి ఎడిట్ చేశాక అవతలి వారికి ఎడిటెడ్ అనే విషయం తెలుస్తుంది.

    ఈ ఫీచర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయం మాత్రం వెల్లడించలేదు. ఇటీవల అంతర్జాయ కాల్స్ బెడద ఉన్న నేపథ్యంలో దానిపై కూడా ఓ యాప్ ను తయారు చేస్తున్నట్లు వాట్సాప్ పేర్కొంది. ఇలా వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తుండటంతో వాట్సాప్ సభ్యుల సంఖ్య పెరగనుంది. ఇప్పటికే వీటిని ఉపయోగిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

    ఈ నేపథ్యంలో వాట్సాప్ సంస్థ వినియోగదారులకు అందుబాటులో అన్ని అవకాశాలు తీసుకొస్తోంది. కొత్త యాప్ లతో అందరికి చేరువ అవుతోంది. ఇలా సౌకర్యవంతమైన యాప్ లతో ముందుంటోంది. భవిష్యత్ లో ఇంకా కొత్త కొత్త యాప్ లను తీసుకొస్తూ తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. ఈ మేరకు చర్యలు వేగంగా తీసుకుంటోంది. ఇలా వినియోగదారుల సేవలో నిరంతరం తపిస్తోంది.