Avatar 3 advance bookings: ప్రపంచ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన అతి కొద్ది హాలీవుడ్ మూవీస్ లో ఒకటి ‘అవతార్'(Avatar Movie). 2010 సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ రికార్డుని మళ్లీ ‘అవతార్ 2’ చిత్రమే బ్రేక్ చేసింది. ఈ రెండు సినిమాలు కేవలం ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రమే కాదు, మన ఇండియా లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ రేంజ్ వసూళ్లను రాబట్టాయి. ముఖ్యంగా రెండవ భాగానికి మన తెలుగు రాష్ట్రాల నుండి 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి అంటనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో మన ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరించారు అనేది. అలాంటి ఫ్రాంచైజ్ నుండి వస్తున్నా ‘అవతార్ 3′(Avatar 3: Fire & Ash) కి ఇండియా వైడ్ గా డిజాస్టర్ రేంజ్ బుకింగ్స్ నమోదు అవుతున్నాయి.
మూవీ లవర్స్ కి అసలు ఈ సినిమా ఈ నెల 19 న విడుదల అవుతుంది అనే విషయం కూడా తెలియదు, అలా ఉంది పరిస్థితి. హైదరాబాద్ సిటీ లో అవతార్ చిత్రం ప్రసాద్ మల్టీప్లెక్స్ లాంటి థియేటర్స్ లో సంవత్సరానికి పైగా ఆడింది. రెండవ భాగానికి కూడా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని అందించారు ఆడియన్స్. అలాంటి హైదరాబాద్ సిటీ లో కూడా ‘అవతార్ 3’ కి ఆశించిన స్థాయి లో బుకింగ్స్ లేకపోవడం గమనార్హం. 3 భాషలు, 7 థియేటర్స్ వెర్షన్స్ కి కలిపి ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కేవలం 88 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది. ఓవరాల్ గా ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కనీసం నాలుగు కోట్ల గ్రాస్ ఓపెనింగ్ కూడా వచ్చేలా కనిపించడం లేదు. ఇది నిజంగా మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి.
ఈ సినిమాకు ఆడియన్స్ లో క్రేజ్ లేకపోవడానికి ముఖ్య కారణం రెండవ భాగానికి అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడం వల్లే. సినిమా ని మొదటి పార్ట్ తో పోలిస్తే చాలా బోరింగ్ గా జేమ్స్ కెమరూన్ తెరకెక్కించాడని, అందుకే అనుకున్నంత స్థాయి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి రాలేదని అంటున్నారు విశ్లేషకులు . తెలుగు రాష్ట్రాల నుండి వంద కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినప్పటికీ రెండవ భాగానికి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారంటే, ఆ సినిమా రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి రాబోయే రోజుల్లో అయినా ఈ సినిమాకు ఆడియన్స్ లో హైప్ పెరిగి అనుకున్నంత స్థాయి వసూళ్లు వస్తాయో లేదో అనేది.