Dhurandhar movie box office collection: ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించి వెయ్యి కోట్ల గ్రాస్ వైపు దూసుకుపోతున్న చిత్రం ‘దురంధర్'(Dhurandhar Movie). రణవీర్ సింగ్(Ranveer Singh) హీరోగా, ఆదిత్య డాల్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కి మొదటి రోజు మొదటి ఆట నుండే, సినిమా అంటే ఇలా ఉండాలి అని ఆడియన్స్ చేత అనిపించేలా చేసింది. సాధారణంగా ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమాకు అయినా వర్కింగ్ డేస్ లో వసూళ్లు రావడం చాలా కష్టం. అలాంటిది ఈ చిత్రానికి వర్కింగ్ డేస్ లో కూడా పాతిక కోట్ల రూపాయిల నెట్ కి తగ్గకుండా వసూళ్లు వస్తున్నాయి. ఇలాంటి అద్భుతం జరిగి దశాబ్దాలు అయ్యింది. ‘పుష్ప 2’ చిత్రం థియేట్రికల్ రన్ ని చూసి గత ఏడాది అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఈ సినిమా ‘పుష్ప 2’ కి మించి వసూళ్లను రాబడుతుంది.
నేడు ఈ చిత్రానికి రెండవ సోమవారం. అయినప్పటికీ కూడా బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 35 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. నేడు కూడా ఈ చిత్రానికి పాతిక కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కాసేపు పక్కన పెడితే 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఇప్పటి వరకు ఎంత నెట్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాము. మొదటి వారం ఈ చిత్రానికి 218 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, రెండవ వీకెండ్ లో 146 కోట్ల రూపాయిలు వచ్చాయని, మొత్తం మీద 12 రోజులకు ఈ చిత్రానికి 365 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. శుక్రవారం రోజున 34 కోట్ల 70 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, శనివారం రోజున 53 కోట్ల 70 లక్షలు, ఆదివారం రోజున 58 కోట్ల 20 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.
ఇది సాధారణమైన విషయం కాదు, భవిష్యత్తులో రాజమౌళి ‘వారణాసి’ చిత్రానికి కూడా ఈ రేంజ్ వసూళ్లు హిందీ వెర్షన్ లో రావడం కష్టమే. ఇక ఓవర్సీస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. బాలీవుడ్ మూవీస్ కి కంచు కోటగా పిలవబడే మిడిల్ ఈస్ట్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయలేకపోయారు. అయినప్పటికీ కూడా 12 రోజులకు కలిపి ఈ చిత్రానికి 13.6 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 123 కోట్ల 66 లక్షలు అన్నమాట. మొదటి వారం 7.8 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, రెండవ వీకెండ్ లో శుక్రవారం రోజున 1.4 మిలియన్ డాలర్లు, శనివారం రోజున 2.1 మిలియన్ డాలర్లు, ఆదివారం రోజున 2.3 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఫుల్ రన్ లో ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో ఎంత దూరం వెళ్లి ఆగుతుందో చూడాలి.