Girl Marriage Traditions: ప్రతి ఇంట్లో ఆడపిల్లను లక్ష్మీదేవిగా భావిస్తారు. అలాంటి ఆడపిల్ల ఎప్పటికైనా పుట్టింటికి వదిలి మెట్రింటికి వెళ్లాల్సిందే. అయితే ఒక ఆడపిల్ల చదువు పూర్తయి పెళ్లి చేసుకున్న తర్వాత అత్తారింటికి వెళ్లిన తర్వాతే ఆమెకు సంపూర్ణ జీవితం లభించినట్లు అని కొందరు భావిస్తారు. కానీ ఎంత మెట్టింటికి వెళ్లినా.. పుట్టింటితో అనుబంధం వెంటనే తెగిపోదు. పుట్టింటికి రావాలన్నా కోరిక.. పుట్టింటి వాళ్లను చూడాలన్న తపన ఎప్పటికీ ఉండే ఉంటుంది. అయితే కొందరు ఆడవాళ్లు తమ పుట్టింటి వాళ్లను గుర్తుపెట్టుకోవడానికి కొన్ని వస్తువులను తీసుకెళ్లాలని అనుకుంటారు. కానీ పొరపాటున కూడా ఈ నాలుగు వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో పుట్టినింటి నుంచి మెట్టినింటి వరకు తీసుకెళ్లకూడదని పండితులు చెబుతున్నారు. మరి పుట్టినిల్లు నుంచి మెట్టినింటికి ఆడపిల్ల తీసుకెళ్లా కూడని ఆ నాలుగు వస్తువులు ఏవో ఇప్పుడు చూద్దాం..
ఉప్పు:
ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఉప్పును ఎవరికి దానం కూడా ఇవ్వకూడదని చెబుతారు. ఉప్పుతో ఎన్నో రకాల మంచి పనులు కూడా చేస్తారు. ఒక ఇంట్లోని ఉప్పు మరొకరి చేతిలోకి వెళ్తే లక్ష్మీదేవి వెళ్లినట్లే అని అనుకుంటారు. ఈ విషయంలో ఆడపిల్లకు కూడా నిబంధన వర్తిస్తుంది. పుట్టినింటి నుంచి మెట్టినింటికి వెళ్లే ఆడపిల్ల ఎప్పుడు కూడా ఉప్పును తీసుకెళ్లరాదని అంటుంటారు. అలా తీసుకెళ్తే పుట్టిన ఇంట్లో ఆర్థిక కష్టాలు ఉంటాయి. పుట్టినిల్లు వారు డబ్బు కొరత ఏర్పడి తీవ్ర ఇబ్బందులు పడతారు. దీంతో ఆడపిల్ల సైతం మనోవేదనకు గురవుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఉప్పును తీసుకెళ్లే ప్రయత్నం చేయొద్దు.
వాడిన పూజా సామాగ్రి:
కొందరు పుట్టిన ఇంట్లో పూజకు వాడిన విలువైన సామాగ్రిని అత్తారింటికి తీసుకెళ్లాలని అనుకుంటారు. కానీ ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఒక ఇంట్లో పూజకు వాడిన వస్తువులు ఆ ఇంట్లో మాత్రమే పనికి వస్తాయి. మరో ఇంటికి వెళ్తే దోషం ఏర్పడుతుంది. అందువల్ల ఆడపిల్ల నుంచి అత్తారింటికి వెళ్లే సమయంలో తల్లి గారి ఇంట్లో వాడినా పూజ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లకూడదు. అంతగా కావాల్సి వస్తే బయట కొత్తవి కొనుక్కోవాలి. లేదా పుట్టిన ఇంటి వారిని కొనాలని కోరవచ్చు.
చేదు వస్తువులు:
పుట్టినింట్లో పెరిగిన చేదుకు సంబంధించిన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లరాదు. ఉదాహరణకు తల్లి గారి ఇంటి వద్ద పండిన కాకరకాయ లేదా అశుభం కలిగించే వస్తువులను తీసుకెళ్లడం ద్వారా ప్రతికూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా అత్తారింట్లో ఆ అమ్మాయికి చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల చేదు కలిగించే వస్తువులను ఏవి కూడా తల్లి గారి ఇంటి నుంచి తీసుకెళ్లకూడదు.
ఇనుప వస్తువులు:
తల్లి గారి ఇంటి నుంచి ఇనుముకు సంబంధించిన వస్తువులు ఏవి తీసుకెళ్లకూడదని అంటుంటారు. ఎందుకంటే ఇనుము శని దేవుడికి సంబంధించినది. ఒక ఇంట్లోని ఇనుము మరో ఇంట్లోకి వెళ్లడం ద్వారా శని కూడా ఆ ఇంటి నుంచి ఈ ఇంట్లోకి వస్తాడని భావిస్తారు. అలాగే తల్లి గారి ఇంట్లో ఉన్న కష్టాలు కూతురి ఇంట్లోకి వస్తాయని అంటారు. అందువల్ల ఇనుము వస్తువులను తీసుకెళ్లకూడదని చెబుతారు.