Hindi Chatrapathi Collections: 100 కోట్లు పెట్టి తీసిన హిందీ ‘ఛత్రపతి’ 3 రోజుల్లో రాబట్టిన వసూళ్లు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

మొదటి రోజు కేవలం 40 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఆ తర్వాత రెండవ రోజు 30 లక్షలు, మరియు నాల్గవ రోజు 20 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇలా మూడు రోజులకు కలిపి కూడా కోటి రూపాయిలు నెట్ వసూళ్లను రాబట్టలేని సినిమా కోసం ఇంత భారీ ఎత్తున థియేటర్స్ లో విడుదల చెయ్యడం వ్యర్థం.

Written By: Vicky, Updated On : May 16, 2023 7:38 am

Hindi Chatrapathi Collections

Follow us on

Hindi Chatrapathi Collections: టాలీవుడ్ లో మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన వీవీ వినాయక్ ఒకప్పుడు తనతో సమానమైన పోటీని ఇచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఛత్రపతి’ సినిమాని హిందీ లో రీమేక్ చేసే స్థాయికి దిగజారిపోతాడని ఎవ్వరూ ఊహించలేదు. అప్పటికే తెలుగు సినిమా హిందీ లో డబ్ అయ్యి యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

అలాంటి సినిమాని వీవీ వినాయక్ లాంటి డైరెక్టర్ కి రీమేక్ చెయ్యాలి అనే ఆలోచన ఎలా వచ్చిందో ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. అది కూడా తెలుగులోనే సరిగా స్థిరమైన మార్కెట్ లేని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని హీరో గా పెట్టి, సుమారుగా వంద కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ పెట్టి తియ్యడాన్ని చూస్తుంటే ‘అయ్యో అంత పెద్ద డైరెక్టర్ ఇలా అయ్యిపోయాడేంటి’ అని అభిమానులు బాధపడే స్థాయి లో ఉంది వినాయక్ పరిస్థితి.

అంత ఖర్చు చేసిన తీసిన ఈ సినిమా మొదటి రోజు కేవలం 40 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఆ తర్వాత రెండవ రోజు 30 లక్షలు, మరియు నాల్గవ రోజు 20 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇలా మూడు రోజులకు కలిపి కూడా కోటి రూపాయిలు నెట్ వసూళ్లను రాబట్టలేని సినిమా కోసం ఇంత భారీ ఎత్తున థియేటర్స్ లో విడుదల చెయ్యడం వ్యర్థం.యూట్యూబ్ లో విడుదల చేసుకున్నా కూడా అంత కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎలాగో బెల్లంకొండ హిందీ డబ్ సినిమాలకు వందల మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తాయి.

వాటి నుండి వచ్చే డబ్బులు కనీసం 10 కోట్ల రూపాయిలు అయినా ఉంటుంది.ఈ చిత్రం కోసం బెల్లం కొండా సాయి శ్రీనివాస్ రెండేళ్ల డేట్స్ ని కేటాయించాడు.ఈ గ్యాప్ లో ఆయన మూడు కమర్షియల్ సినిమాలు తీసుకొని అందులో ఒక్కటి అయినా హిట్ కొట్టేవాడు,ఇప్పుడు అటు హిందీ, ఇటు తెలుగు, ఎటూ కాకుండా పోయింది బెల్లంకాన్ద పరిస్థితి పాపం.