150 weddings canceled: పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు. ఒక పెళ్లి జరగడానికి ఎంతో పెద్ద ప్రయాస ఉంటుంది. రెండు తెలియని కుటుంబాలు పెళ్లి అనే బంధంతోనే ఒక్కటవుతాయి. ఈ క్రమంలో రెండు కుటుంబాల వైపు అటు ఏడు తరాలు.. ఇటు ఏడూ తరాలు చూడాలని అంటారు. అయితే అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా.. అన్ని రకాల సంప్రదింపులు చేసినా.. జంటల మధ్య ఏర్పడిన మనస్పర్ధలను కారణంగా చాలా వరకు పెళ్లిళ్లు రద్దు అవుతున్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇటీవల 40 రోజుల్లో 150 కి పైగా పెళ్లిళ్లు రద్దు అవడం సంచలనం గా మారింది. అసలు ఈ పెళ్లిళ్లు రద్దు కావడానికి కారణం ఏంటో తెలుసా?
మొన్నటి వరకు పెళ్లయిన ఏడాదికోలేక రెండు సంవత్సరాలకు ఇద్దరి వ్యక్తుల మధ్య మనస్పర్ధలు ఏర్పడి విడిపోయేవారు. అయితే ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోవడానికి కనీసం ఏడాది పాటు సమయం ఉంటుంది. ఈ కాలంలో మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో పెళ్లి నిశ్చయము అయ్యాక మూడు ముళ్ళు పడక ముందే జంటలు దూరమవుతున్నాయి. వీరి పెళ్లిళ్లు రద్దు కావడానికి సోషల్ మీడియా ప్రధాన కారణం కావడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సోషల్ మీడియా ద్వారా చాలామందికి చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. కానీ పెళ్లి చేసుకునే వారికి మాత్రం ఇది శత్రువులుగా మారింది.
ఇటీవల ఇండోర్-గుజరాత్ కు చెందిన ఓ జంట తమ పెళ్ళికి సంబంధించిన ఫ్రీ వెడ్డింగ్ షూట్ అమ్మాయి తన సోషల్ మీడియా ఖాతాలో అప్లోడ్ చేసింది. అయితే ఈ విషయమై పెళ్లి చేసుకోబోయే జంట మధ్య వివాదం ఏర్పడింది. ఆ తర్వాత తీవ్రంగా గొడవలు ఏర్పడి పెళ్లిని రద్దు చేసుకున్నారు. అలాగే వధువు లేదా వరుడుకి సంబంధించిన పాత స్నేహితులు, పాత విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోలను, ఫోటోలను చూసిన వధువు లేదా వరుడు మనస్పర్దానికి గురై పెళ్ళికి రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది
. దీనిపై హిందీ పత్రిక సర్వే నిర్వహించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇటీవల కాలంలో గత 40 రోజుల్లో 150 పెళ్లిళ్లు సోషల్ మీడియా కారణంగానే రద్దు అయినట్లు తెలిపింది. ఇందులో 60 నుంచి 70 శాతం వరకు పాత స్నేహితుల సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా అని పేర్కొంది. అయితే ఈ విషయం తెలిసిన చాలామంది జాగ్రత్తపడి సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలను, వీడియోలను డిలీట్ చేస్తున్నారు. అలాగే పాత స్నేహితులను కలవకుండా దూరంగా ఉంటున్నారు.