Chinese fighting robots: మిగతా దేశాలకు సాంకేతిక పరిజ్ఞానం అనేది అవసరం. డ్రాగన్ దేశానికి అంతకుమించి. అందువల్లే శాస్త్ర సాంకేతిక విభాగాలలో డ్రాగన్ విపరీతంగా ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్ల తమ దేశం ఎంతగా ఇబ్బంది పడిందో డ్రాగన్ కు తెలుసు. అందువల్లే ఆ రంగాలలో అభివృద్ధి చెందడానికి.. సరి కొత్తగా మార్పులు తీసుకురావడానికి డ్రాగన్ విశేష కృషి చేసింది. అందువల్లే ఆ విభాగాలలో విపరీతమైన వృద్ధిని సాధించింది. ప్రపంచ దేశాలను సైతం సవాల్ చేస్తూ సరికొత్తగా దూసుకుపోతోంది డ్రాగన్…
డ్రాగన్ కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రయోగాలు మాత్రమే కాదు.. ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా ఉత్పత్తులను తయారు చేస్తోంది.. అమెరికాను మించి యుద్ధ విమానాలు.. మిస్సైల్స్.. రాకెట్లు.. ఇంకా చెప్పాలంటే కనీ విని ఎరుగని స్థాయిలో ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఇక రోబోటిక్స్ లో అయితే చైనా చేస్తున్న ప్రయోగాలు ప్రపంచాన్ని నివ్వేర పరుస్తున్నాయి. ఈ ప్రయోగాల ఫలితాలను కూడా చైనా చవిచూస్తోంది. తాజాగా చైనా చేస్తున్న ప్రయోగాలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చింది. ఆ వీడియో కాస్త ఇప్పుడు విస్తృతంగా కనిపిస్తోంది.
చైనాలోని ఓ మైదానంలో ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనం వేసుకొని వస్తుంటాడు. అతడికి ఎదురుగా ఒక రోబోట్ వస్తుంది. అది అతడి మీదుగా దూసుకు వస్తుంది. ఈ బైకర్ కు ఏం చేయాలో తెలియదు. వెంటనే తన బైక్ ను పార్క్ చేసి వెళ్లిపోతాడు. దీంతో ఆ రోబో అతడి వాహనం వద్దకు వచ్చి తన చేతులతో గుద్దుతుంది. వాహనాన్ని ధ్వంసం చేస్తుంది. దూరంగా ఉండి చూస్తున్న ఆ వ్యక్తి భయపడిపోతాడు. అంతేకాదు ఆ రోబో ను చూసి వెనక్కి వెళ్ళిపోతాడు. ఇది కేవలం ఫన్నీ వీడియో మాత్రమే కాదు.. ప్రపంచాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి చైనా చేసిన ప్రయోగం ఇది. భవిష్యత్ కాలంలో రోబోలతోనే యుద్ధం చేస్తామని చైనా చెప్పకనే చెబుతోంది.
Okay.. this is terrifying.
China’s robots aren’t built for fun… They’re built for war.
Watch the clips and tell me you’re not scared pic.twitter.com/bFhxTI2j8b
— Devin AI News and Tools (@toolandtea) September 5, 2025