GST 2.0 essential items tax cut: ఇటీవల నిర్వహించిన GST కౌన్సిలింగ్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. గత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో జీఎస్టీ పై శుభవార్త వినబోతున్నారని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే ఇటీవల నిర్వహించిన సమావేశంలో వస్తువుల పై జిఎస్టి తగ్గింపు గురించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాల వల్ల మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు సెప్టెంబర్ 22 నుంచి కొనే వస్తువులపై భారీగా తగ్గింపు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఏ ఏ వస్తువులపై ఎంత జిఎస్టి ఉండబోతుంది? ఎంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం.
మధ్యతరగతి ప్రజలకు కొన్ని రోజులుగా వస్తువుల ధరలతో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే దానిపై జిఎస్టి ఉండడంతో అదనపు ధర వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చింది. అయితే సెప్టెంబర్ 22 నుంచి కొన్ని వస్తువులపై జిఎస్టిని తగ్గిస్తున్నారు. దీంతో నిత్యవసర వస్తువుల ధరలు తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మనం రోజు ఉపయోగించే సబ్బులు,, షేవింగ్ క్రీమ్, ఫేస్ పౌడర్, టూత్ బ్రష్, హెయిర్ ఆయిల్ వంటి వాటిపై ఇప్పటివరకు జీఎస్టీ 18% ఉండేది. ఇకనుంచి వీటిపై ఐదు శాతం మాత్రమే జీఎస్టీ విధించనున్నారు. దీంతో ఈ వస్తువుల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. అలాగే ప్యాక్ చేసి ఉన్న ఫుడ్ ఐటమ్స్ పై కూడా జీఎస్టీ తగ్గే అవకాశం ఉంది. వీటిలో డైరీ మిల్క్, కిసాన్ జామ్, బ్రూ కాఫీ పౌడర్, నెయ్యి, బట్టర్ ప్యాక్, నూడుల్స్ ప్యాక్ వంటి డైలీ వంటింట్లో ఉపయోగించే వాటిపై ఇప్పటివరకు జీఎస్టీ 12 శాతం ఉండేది. కానీ ఇకనుంచి వీటిపై ఐదు శాతం మాత్రమే విధించనున్నారు. దీంతో వీటి వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.
ఇక పిల్లలు ప్రతిరోజు స్నాక్స్ ప్యాకెట్స్ లేకుండా ఉండలేరు. అయితే వీరి కోసం కొనుగోలు చేసే ఈ ప్యాకెట్స్ పై ఇప్పటివరకు జీఎస్టీ 12% జిఎస్టి విధించేవారు. వీటిలో మిక్చర్, బూజి వంటి ప్యాకెట్లపై సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీని 5% విధించనున్నారు. దీంతో వీటి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంట్లో ఉపయోగించే వంట పాత్రలపై ఇప్పటివరకు జీఎస్టీని 12% విధించేవారు. వీటిపై కూడా జీఎస్టీని సెప్టెంబర్ 22 నుంచి 5% విధించనున్నారు. దీంతో వీటి ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.
అప్పుడే పుట్టిన పిల్లల కోసం ఉపయోగించే వస్తువులపై కూడా జీఎస్టీని తగ్గించారు. బేబీ ఫీడింగ్ బాటిల్, డైపర్స్ వాటిపై 12% జిఎస్టి ఉండేది. ఇకనుంచి వీటిపై 5% జిఎస్టి ఉండనుంది. ఇల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరి కల. అయితే ఇందులో ముఖ్యమైన వస్తువుగా ఉండే సిమెంట్ ధర ఇప్పటివరకు అధికంగా ఉండేది. దీనిపై 28% జిఎస్టి ఉండేది. ఇకనుంచి సిమెంట్ పై 18% జిఎస్టిని విధించనున్నారు. దీంతో సిమెంట్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.