Rajasekhar career: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రాజశేఖర్… కెరియర్ మొదట్లో వరుసగా మంచి విజయాలను సాధించి యాంగ్రీ యంగ్ మాన్ గా మంచి పేరు ప్రఖ్యాతను సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపు సంపాదించి పెట్టినవే కావడం విశేషం… ఇక ఒకానొక సందర్భంలో రాజశేఖర్ స్టార్ హీరోలందరి తో పోటీ పడుతూ ముందుకు దూసుకెళ్లాడు. కానీ ఆయన తీసుకున్న కొన్ని డిసీజన్స్ వల్ల ఆయన హీరోగా ఎదగలేకపోయాడు. ఇక తన భార్య అయిన జీవిత సైతం అతను చేసే సినిమాల్లో ఇన్వాల్వ్ అవ్వడం కథల ఎంపికలో చాలావరకు తప్పులు చేయడం వల్ల స్టార్ హీరో అవ్వాల్సిన రాజశేఖర్ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు. ఇక ఆ తర్వాత ఆయన కెరీర్ భారీగా డౌన్ ఫాల్ అయిపోయింది. మరి ఏది ఏమైనా కూడా ఒకసారి హీరో అయిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా స్టార్ డమ్ ఉందని ముందుకెళ్తే మాత్రం సినిమాలు ఆడవు…
తద్వారా వాళ్ళకి భారీ లాసెస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఏది ఏమైనా కూడా రాజశేఖర్ ఒక అగ్రెసివ్ గా ముందుకు వెళ్లడం అనేది ఆయనకు చాలా వరకు మైనస్ గా మారింది…ఇక రాజశేఖర్ లాంటి నటుడు ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలు అయితే చేయడం లేదు.
ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి నితిన్ హీరోగా వచ్చిన ‘ఎక్స్ట్రాడినరీ మ్యాన్’ అనే సినిమాలో నటించినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరాడు అంటూ చాలామంది తేల్చేశారు. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తను తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇక జగపతిబాబు లాంటి నటుడు సైతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో రాజశేఖర్ మాత్రం సినిమాలు చేయడం లేదని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే చాలావరకు ఆయన గొప్ప సినిమాలను చేస్తారని అందరూ అనుకున్నప్పటికి ఆశించిన మేరకు ఆయన ఇప్పుడు సినిమాలని చేయలేకపోతున్నారు… గతంలో హీరోగా కొన్ని సినిమాలు చేసినప్పటికి అవి పెద్దగా వర్కౌట్ కాలేదు…