International Space Station: ఐఎస్‌ఎస్‌లో ఎమర్జెన్సీ.. సురక్షిత స్థావరాలకు వ్యోమగాములు!

ఐఎస్‌ఎస్‌కు అతి సమీపంలో బుధవారం(జూన్‌ 26న) ఓ ఉపగ్రహం ముక్కైంది. శకలాలలను విడుదల చేసింది. ఈవిషయాన్ని నాసా గుర్తించింది. వెంటనే అంతరిక్షంలోని వ్యోమగాములకు విషయం తెలిపి అలర్ట్‌ చేసింది.

Written By: Raj Shekar, Updated On : June 28, 2024 5:20 pm

International Space Station

Follow us on

International Space Station: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో ఇటీవల కొద్దిసేపు ఎమర్జెన్సీ ప్రకటించారు. దీంతో వ్యోమగాములంతా సురక్షిత స్థావరాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఐఎస్‌ఎస్‌కు అత్యంత సమీపంలో భారీగా ఉప గ్రహ వ్యర్థాలు సంచరించడంతో ఈ పరిస్థితి నెలొకంది.

ముందే గుర్తించిన నాసా..
ఐఎస్‌ఎస్‌కు అతి సమీపంలో బుధవారం(జూన్‌ 26న) ఓ ఉపగ్రహం ముక్కైంది. శకలాలలను విడుదల చేసింది. ఈవిషయాన్ని నాసా గుర్తించింది. వెంటనే అంతరిక్షంలోని వ్యోమగాములకు విషయం తెలిపి అలర్ట్‌ చేసింది. గ్రహ శకలాలు ఐఎస్‌ఎస్‌ను ఢీకొనే ప్రమాదం ఉన్నందున సురక్షిత స్థావరాల్లో తలదాచుకోవాలని సూచించింది. దీంతో ఐఎస్‌ఎస్‌లోని వ్యోమగాములంతా వారికి సంబంధించిన స్పేస్‌ క్రాఫ్ట్‌ల్లోకి వెళ్లిపోయారు.

స్టార్‌లైనర్‌లోకి వెళ్లిన సునీతా విలియమ్స్‌
ఇక జూన్‌ 5న ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతావిలియమ్స్‌ మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ వారు అంతరిక్షంలోకి వెళ్లిన స్టార్‌ లైనర్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లోకి వెళ్లి దాక్కున్నారు. స్టార్‌లైనర్‌ మరమ్మతుల కారణంగా వారు ఇప్పటికీ ఐఎస్‌ఎస్‌లోనే ఉండిపోయారు. షెడ్యూల్‌ ప్రకారం వారు జూన్‌ 15న భూమికి తిరిగి రావాల్సి ఉంది. కాని స్పేస్‌ క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపాలతో అక్కడే ఉండిపోయారు.

గంటపాటు ఎమర్జెన్సీ..
ఇదిలా ఉంటే.. నాసా సూచన మేరకు ఐఎస్‌ఎస్‌లో సుమారు గంటపాటు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ క్రమంలో నాసా సైంటిస్టులు మిషన్‌ కంట్రోల్స్‌ అక్కడి వ్యర్థాల గమనాన్ని పరిశీలించారు. ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాత వ్యోమగాములకు క్లియరెన్స్‌ ఇచ్చారు.

రష్యా ఉపగ్రహంగా గుర్తింపు..
కాగా రష్యాకు చెందిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ ఉపగ్రహం రిస్యూర్స్‌– 1 రెండేళ్ల క్రితం నిరుపయోగంగా మారింది. ఇది భుధవారం దాదాపు 100 ముక్కలైంది. ఈ పరిణామాలు మొత్తం ఐఎస్‌ఎస్‌కు సమీపంలో జరగడంతో కొన్ని గంటలపాటు శకలాలు వెలువడ్డాయని లియో ల్యాబ్స్‌ అనే స్పేస్‌ ట్రాకింగ్‌ సంస్థ పేర్కొంది. మరోవైపు రష్యాకు చెందిన రాస్‌కాస్మోస్‌ ఏజెన్సీ నుంచి ఎలాంటి వివరణ లేదు. ఇప్పటికే అంతరిక్షంలో వేల సంఖ్యలో గ్రహ శకలాలు సంచరిస్తున్నాయి. అవి ప్రస్తుతం పనిచస్తున్న శాటిలైట్లకు ముప్పుగా మారాయి.