Raashii Khanna: పెళ్లి కాకుండానే తల్లి అయిన రాశి ఖన్నా.. ఏం జరిగిందంటే..

జోరు, బెంగాల్ టైగర్, శివం, జిల్, జై లవ కుశ, సుప్రీం, హైపర్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం అంటూ కెరీర్ స్టాటింగ్ లోనే దూసుకొని పోయింది అమ్మడు. కానీ ఈమె కెరీర్ లో పెద్ద హిట్ లు లేవనే చెప్పాలి.

Written By: Swathi, Updated On : June 28, 2024 5:11 pm

Raashii Khanna

Follow us on

Raashii Khanna: సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాదు. ఓవర్ నైట్ కొందరు ఫేమ్ అయితే మరికొందరు మాత్రం కనిపించకుండా పోతారు. ఇండస్ట్రీలో రాణించాలంటే మచ్చ ఉండాల్సిందే. హీరోయిన్ రాశి ఖన్నా కెరీర్ కూడా ప్రస్తుతం ఢీలా పడిందనే చెప్పాలి. అందం, టాలెంట్ ఉన్నా కూడా ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు అమ్మడు. ఇక ఈ అమ్మడు ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది.

జోరు, బెంగాల్ టైగర్, శివం, జిల్, జై లవ కుశ, సుప్రీం, హైపర్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం అంటూ కెరీర్ స్టాటింగ్ లోనే దూసుకొని పోయింది అమ్మడు. కానీ ఈమె కెరీర్ లో పెద్ద హిట్ లు లేవనే చెప్పాలి. జై లవ కుశ మంచి హిట్ ను సంపాదించినా అమ్మడుకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో స్టార్ హీరోల సరసన నటించిన సినిమాలు కూడా చాలా తక్కువ. ఎన్టీఆర్ తప్ప మిగిలిన హీరోలు రాశి ఖన్నా తో సినిమా చేసింది లేదు.

టైర్ 2 హీరోలతో నటించినా అవి బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి. అయితే బాలీవుడ్‌లో మాత్రం రాశి ఖాన్నా మంచి క్రేజ్ ను సంపాదించింది. అక్కడ వరుస సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లోనటిస్తూ ఫుల్ బజీ అయింది బ్యూటీ. ప్రస్తుతం అమ్మడుకు చెందిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ చిన్న పాపని ఎత్తుకొని ఉన్న ఫొటోలను షేర్ చేసింది బ్యూటీ. దీంతో పెళ్లి కాకుండానే రాశీ ఖన్నా తల్లి అయిందా అంటూ తెగ టెన్షన్ పడుతున్నారు ఆమె అభిమానులు.

కానీ ఈ ఫోటోలో ఉన్న పాప తన మేనకోడలు అని తెలిపింది రాశీ. నా అందమైన మేనకోడలు రాకతో మా కుటుంబం అందంగా మారిందని..తన లిటిల్ ప్రిన్సెస్ ను చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఇది చూసిన నెటిజన్లు పాప కూడా మీలాగే క్యూట్ గా బ్యూటిఫుల్‌గా ఉందంటూ కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.