Electric Bike Latest Update: ప్రస్తుత కాలంలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యుల జేబు గుల్ల అవుతోంది. ముఖ్యంగా ఉద్యోగులు తమకు వచ్చే ఆదాయం సగం వరకు పెట్రోల్ కి ఖర్చవుతుందని ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ బాధ తగ్గించడానికి మార్కెట్లోకి ఎలక్ట్రిక్ బైకులు అందుబాటులోకి వచ్చాయి. అయితే పెట్రోల్ బైక్ లో పెట్రోల్ అయిపోతే అందుబాటులో పెట్రోల్ బంకులు ఉన్నాయి. కానీ ఎలక్ట్రిక్ బైక్ లకు చార్జింగ్ పాయింట్లు అందుబాటులో లేవు. అంతేకాకుండా ఎలక్ట్రిక్ బైక్ లకు చార్జింగ్ సౌకర్యం అనువైనచోట్ల లేవు. ఇలాంటి సమయంలో పెట్రోల్ బాధ నుంచి తగ్గించేందుకు.. చార్జింగ్ సమస్య నుంచి బయటపడేందుకు Hero కంపెనీ కొత్త బైక్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అది ఎలా ఉందంటే?
ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ మయం అయిపోతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ రావడానికి ఎలక్ట్రిక్ బైక్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్యార్థుల నుంచి కొందరు వ్యాపారుల వరకు ఎలక్ట్రిక్ బైకులు కొనుగోలు చేస్తున్నారు. వీటి ధరలు కూడా అందుబాటులోకి రావడంతో చాలామంది వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ బైక్ లకు ప్రధాన సమస్య చార్జింగ్ పాయింట్లు లేకపోవడం. వీటికి ఇంట్లో తప్ప మార్కెట్లో అనువైన ప్రదేశాల్లో చార్జింగ్ పాయింట్ లేకపోవడంతో చాలామంది ఈ సమస్యను గుర్తించి.. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు వెనుకాడుతున్నారు.
అయితే ఈ సమస్యను గుర్తించిన Hero Moto Cop మార్కెట్లోకి Vida V2 అనే ఎలక్ట్రిక్ బైక్ లను తీసుకొచ్చింది. ఇందులో విభిన్నంగా రిమూవల్ బ్యాటరీస్ ను అందుబాటులో వచ్చింది. ఈ బ్యాటరీలు బైక్ నుంచి తీసుకోవచ్చు. వీటిని ఇంట్లోకి తీసుకెళ్లి చార్జింగ్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇతర ప్రదేశాల్లోనూ వీటిని చార్జింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ సౌకర్యం లేనివారు, పార్కింగ్ చేసే చోట సాకెట్ లేని వారికి ఇది అనుగుణంగా ఉంటుంది. ఈ రిమూవల్ బ్యాటరీస్ తో ఫుల్ చార్జింగ్ తీసుకొని ఆ తర్వాత ఎక్కడికంటే అక్కడికి ప్రయాణం చేయవచ్చు.
Also Read: Electric Bike : పాత యాక్టివాను ఎలక్ట్రిక్‌గా మార్చడం లాభమా? నష్టమా?
ఎలక్ట్రిక్ బైక్ ద్వారా తక్కువ ఖర్చుకే ఎక్కువ ప్రయాణం చేయవచ్చు. పెట్రోల్ కంటే ఈ వాహనాలు ఎంతో మేలుగా ఉంటాయి. అయితే చార్జింగ్ సమస్యను కూడా నివారించేందుకు హీరో కంపెనీ కొత్తగా రిమూవల్ బ్యాటరీస్ను అందుబాటులోకి తేవడంతో చాలామంది ఈ వాహనాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే వీటి ద్వారా కాస్త ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం మార్కెట్లో వీడా వీటు బైక్ను రూ.1,20,000 లతో విక్రయిస్తున్నారు. ఇందులో వేరియంటును బట్టి ధర కూడా మారే అవకాశం ఉంది. సిటీలో ఉండే వారితోపాటు గ్రామాల్లో ఉండే వారికి సైతం ఇది అనుగుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు గ్రామాల్లో ఉండేవారు చార్జింగ్ సమస్యతో బాధపడేవారు. ఇప్పుడు రిమూవల్ బ్యాటరీస్ ఉండడంతో ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లి చార్జింగ్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పటివరకు ఎలక్ట్రిక్ బైకులు ఒక్కసారిగా చార్జింగ్ ఆగిపోతే వాహనాన్ని అక్కడే నిలిపివేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు బైక్ లోనే బ్యాటరీస్ను తీసుకెళ్లి చార్జింగ్ పెట్టి మళ్ళీ తీసుకురావచ్చు.