Electric Bike : ప్రస్తుతం మన దేశంలో ఎన్నో రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ, కొంతమంది తమ పాత పెట్రోల్ స్కూటర్లను ఎలక్ట్రిక్‌గా మార్చుకుంటున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో పాత పెట్రోల్ స్కూటర్లను ఎలక్ట్రిక్‌గా మార్చే అనేక స్టార్టప్‌లు ఉన్నాయి. ప్రతి ప్రయత్నానికి కొన్ని లాభాలు, నష్టాలు ఉంటాయి. ఇక్కడ ఎలక్ట్రిక్ మార్పిడి లాభాలు, నష్టాలు రెండింటినీ పరిశీలిద్దాం.
పెట్రోల్ స్కూటర్‌ను ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మార్చడానికి, స్కూటర్ పెట్రోల్ ఇంజిన్‌ను తీసివేసి దాని స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చుతారు. ఈ ప్రక్రియను “రెట్రోఫిటింగ్” అంటారు. ఈ ప్రక్రియ సాధారణంగా రూ.25,000 నుండి ప్రారంభమవుతుంది.. అయితే ఖర్చు బ్యాటరీ కెపాసిటీ, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
Also Read: రెనాల్ట్ డస్టర్ పేరు ఖరారు.. భారత్‌లో ‘బోరియల్’గా రిలీజ్.. ఫీచర్లు ఇవే!
ఇప్పుడు రెట్రోఫిటింగ్ వల్ల కలిగే లాభాలు
* పెట్రోల్‌తో పోలిస్తే విద్యుత్ చాలా చౌకైనది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ప్రయాణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.
* ఎలక్ట్రిక్ మోటార్‌లో మూవబుల్ పార్ట్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ లేదా క్లచ్ వంటి వాటి అవసరం ఉండదు. పెట్రోల్, సర్వీసింగ్ రెండింటిపై ఖర్చు తగ్గుతుంది.
* ఎలక్ట్రిక్ స్కూటర్ వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదు. కాబట్టి పర్యావరణానికి హాని కలగదు.
* కొన్ని రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీలు, రోడ్డు టాక్స్‌లో మినహాయింపులు లేదా రిజిస్ట్రేషన్‌లో రాయితీలు లభించవచ్చు.
* ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా తక్కువ శబ్దం చేస్తుంది. స్మూత్ గా ఉంటుంది.
* అతి పెద్ద లాభం ఏమిటంటే మీ పాత స్కూటర్ ఉపయోగంలోకి వస్తుంది.
Also Read : పెట్రోల్ ఖర్చులకు భయపడాల్సిన పనిలేదు! హీరో తీసుకొచ్చింది సూపర్ మైలేజ్ బైక్!
ఇప్పుడు రెట్రోఫిటింగ్ వల్ల కలిగే నష్టాలు
* పెట్రోల్ స్కూటర్‌ను ఎలక్ట్రిక్‌గా మార్చడం ఒక టెక్నికల్ ప్రక్రియ. ఉదాహరణకు మీరు మీ హోండా యాక్టివాను ఎలక్ట్రిక్‌గా మార్చాలనుకుంటే దీనికి రూ.50,000 వరకు ఖర్చు కావచ్చు.
మార్చిన స్కూటర్ రేంజ్ (ఒకసారి ఛార్జ్‌పై ఎంత దూరం వెళ్లగలదు) లిమిటెడ్ గా ఉంటుంది. సాధారణంగా 50-80 కి.మీ.. ఇది ప్రస్తుతం వస్తున్న చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్‌తో సమానం లేదా తక్కువగా ఉంటుంది.
* మీ ప్రాంతంలో ఛార్జింగ్ స్టేషన్‌లు లేకపోతే ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీనికి ఎక్కువ సమయం పడుతుంది (4-6 గంటలు లేదా అంతకంటే ఎక్కువ).
* మీరు ఏదైనా పెట్రోల్ స్కూటర్‌ను మార్పు చేస్తే దాని అసలు వారంటీ రద్దు అవుతుంది. సరైన పద్ధతిలో చేయకపోతే సేఫ్టీ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది.
* RTO నుండి మళ్లీ అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అనుమతి లేకుండా మార్పిడి చేస్తే అది చట్టవిరుద్ధం అవుతుంది. చలానా కూడా విధించవచ్చు.
* ఇంత ఖర్చు చేసినప్పటికీ మీరు పాత స్కూటర్‌నే నడపవలసి ఉంటుంది. దీని కంటే కొంచెం ఎక్కువ డబ్బుతో కొత్త స్కూటర్ కొనడం మంచిది. దానికి వారంటీ ఉంటుంది. అది కొత్తది కూడా అవుతుంది.