Star Heroes In Police Roles: గతంలో తమిళ్ సినిమా హీరోలు వాళ్లకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడానికి మంచి సినిమాలు చేస్తూ విశేషమైన ఆదరణను సంపాదించుకున్నారు. ఇక వాళ్ల సినిమాలు తెలుగులో సైతం డబ్ చేసి ఇక్కడ కూడా రిలీజ్ చేయడంతో తెలుగులో సైతం వాళ్లకు భారీ మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ఇక మన తెలుగు హీరోలు మాత్రం ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయ్యేవారు. ఇతర భాషల్లో వాళ్లకు మార్కెట్ అనేది ఉండేది కాదు. పొరపాటున తమిళ్ లో మన సినిమాలు రిలీజ్ చేసిన ఎవరు పట్టించుకునే వారే కాదు. కానీ ఇప్పుడు బాహుబలి పుణ్యమాని పాన్ ఇండియాలో మన సినిమాలకు భారీ మార్కెట్ అయితే ఏర్పడింది.
ఇక ఇదిలా ఉంటే పోలీస్ గెటప్ లో మన స్టార్ హీరోలు తమిళ్ స్టార్ హీరోల మధ్య ఒక భారీ పోటీ అయితే నడుస్తోంది. మనవాళ్లు చేసిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ల ముందు తమిళ తంబీలు నిలబడలేకపోయారు అంటూ కొంతమంది కాన్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. కానీ తమిళ ప్రేక్షకులు మాత్రం మా హీరోలే చాలా అద్భుతంగా చేశారు. తెలుగు హీరోలు మా వాళ్ళ ముందు ఎందుకు పనికిరారు అంటూ కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక పోలీస్ గెటప్ లో మన హీరోలు తమిళ్ హీరోల కంటే ఎందుకు బెస్ట్ అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
మహేష్ బాబు ‘ పోకిరి’ (Pokiri) సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించి సడన్ సర్ప్రైజ్ ఇచ్చి ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత దూకుడు సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించి తెలుగు ప్రేక్షకులందరికి తన నటన ప్రతిభను తెలియజేశాడు…
Also Read: Gunasekhar- Mahesh Babu: మహేష్ కి పోలీస్ గెటప్ అంటే భయం… సూపర్ స్టార్ పరువు తీసేసిన గుణశేఖర్
ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో దళపతి విజయ్ పొక్కిరీ, తేరి లాంటి సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. కానీ మహేష్ బాబు కి పోలీస్ గెటప్ లో వచ్చినంత క్రేజ్ విజయ్ కైతే రాలేదు. విజయ్ ఎప్పుడు మహేష్ బాబును ఇమిటేట్ చేశాడే తప్ప ఆయన ఓన్ స్టైల్ లో కనిపించే ప్రయత్నం చేయలేదు. అందువల్లే విజయ్ ని పోలీస్ గెటప్ లో చూడడం కొంతవరకు ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది…
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రాఘవన్ (Raghavan) సినిమాతో కమల్ హాసన్ (Kamal Hasan) పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. కానీ ఘర్షణ (Gharshana) సినిమాలో వెంకటేష్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఒక రకంగా వెంకటేష్ తో పోలిస్తే కమల్ హాసన్ రాఘవన్ లో చేసిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ తేలిపోతుంది. వెంకటేష్ ని చూస్తే పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ లాగే కనిపిస్తూ ఉంటాడు…
ఇక సూర్య కొంత వరకు పోలీస్ గెటప్ లో పర్లేదు అనిపించినప్పటికి ‘విక్రమార్కుడు’ (Vikramarkudu) సినిమాలో రవితేజ చేసిన ‘ విక్రమ్ సింగ్ రాథోడ్’ క్యారెక్టర్ ముందు సూర్య తేలిపోయాడనే చెప్పాలి. సూర్య యముడు సినిమాలో పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్ర విక్రమ్ సింగ్ రాథోడ్ ఎనర్జీని మ్యాచ్ చేయలేకపోయింది…
ఇలా మొత్తానికైతే మన స్టార్ హీరోలు తమిళ్ స్టార్ హీరోలను పోలీస్ గెటప్లో డామినేట్ చేస్తూ వస్తున్నారనే చెప్పాలి…