Ear Buds : సింగర్స్ పాటలు పాడుతున్నప్పుడు చెవుల్లో ఇయర్ బడ్స్ ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

మన చెవిలో ఏదైనా గులిబి ఉంటే ఇయర్ బడ్స్ వాడతాం. దాన్ని అటూ ఇటూ తిప్పి సాంత్వన పొందుతాం. అయితే పాటలు పాడే సింగర్స్ మాత్రం తప్పకుండా ఇయర్ బడ్స్ వినియోగించాల్సిందే. పైగా ఇటీవల కాలంలో సింగర్స్ వీటిని వాడటం ఎక్కువైపోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 15, 2024 8:55 pm

Ear Buds 

Follow us on

Ear Buds  : వినోదం అనేది కొత్త పుంతలు తొక్కుతోంది. చానల్స్ ప్రేక్షకులను అలరించడానికి కొత్త కొత్త కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. ఇందులో భాగంగా లైవ్ షో లను కూడా నిర్వహిస్తున్నాయి. వెనుకటి రోజుల్లో పాడుతా తీయగా కార్యక్రమం ప్రసారమైనప్పుడు.. పోటీలో ఉన్న వర్ధమాన గాయకుల చెవులలో ఇయర్ మానిటరింగ్ మిషన్ అమర్చేవారు. దీనివల్ల పాట పాడుతున్నప్పుడు గాయకులకు బయట శబ్దం ఎక్కువగా వినిపించేది కాదు. పైగా ఆ ఇయర్ మానిటరింగ్ మిషన్ వాయిద్య కారుల సంగీత పరికరాలతో అనుసంధానమై ఉంటుంది. వారు సంగీత పరికరాలతో ధ్వనులు చేస్తున్నప్పుడు గాయకులకు సులభంగా అర్థమవుతుంది. అప్పుడు వాటి శబ్దాలను అర్థం చేసుకొని పాటలు పాడేవారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత ఇయర్ మానిటరింగ్ యంత్రాలు అరుదుగా మాత్రమే వాడుతున్నారు. పాట రికార్డింగ్ సమయంలో సంగీత దర్శకులు వీటిని ఉపయోగిస్తున్నారు.. వీటివల్ల పాడే గాయకులు.. వాయిద్య కారులు.. సంగీత దర్శకుల మధ్య సమన్వయం ఉంటుంది. అప్పుడు పాట శృతి తప్పకుండా ఉంటుంది. అందువల్లే సినిమాల్లో పాటలు వింటున్నప్పుడు ఎటువంటి డిస్టబెన్స్ వినిపించకపోవడానికి కారణం అదే.

వాటి స్థానంలో ఇయర్ బడ్స్ వచ్చేశాయ్

ప్రస్తుత కాలంలో ఇయర్ మానిటరింగ్ స్థానంలో ఇయర్ బడ్స్ వచ్చాయి. సాంసంగ్, ఆపిల్, వన్ ప్లస్, బోట్, మార్షల్.. వంటి ప్రఖ్యాత సంస్థలు ఇయర్ బడ్స్ ను తయారుచేస్తున్నాయి. హై ఎండ్ క్వాలిటీతో వీటిని తయారు చేయడం వల్ల గాయకులకు మాత్రమే కాదు లైవ్ షోస్ నిర్వహించే యాంకర్లకు కూడా ఉపయుక్తంగా ఉంటున్నాయి.

నూటికి నూరు శాతం స్పష్టత

ఇయర్ బడ్స్ లో శబ్దానికి సంబంధించి క్లారిటీ అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక్కసారి చెవులలో పెట్టుకున్నప్పుడు బయట శబ్దం పెద్దగా వినిపించదు. గాయకులు పాటలు పాడే సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. లైవ్ షో లలో యాంకర్లు కూడా వీటిని వినియోగిస్తున్నారు. అప్పటికప్పుడు షోలో మార్పులు, చేర్పులు చేయాల్సి వచ్చినప్పుడు వీసీఆర్ ద్వారా నిర్వాహకులు ఇచ్చిన సమాచారాన్ని యాంకర్లు ఇయర్ బడ్స్ ద్వారా వినొచ్చు. ఆ మాటలు బయట వ్యక్తులకు వినిపించవు. ఇక ప్రస్తుతం పలు చానల్స్ నిర్వహిస్తున్న పాటల పోటీ లలో పాల్గొంటున్న వర్ధమాన గాయకులు చెవులలో ఇయర్ బడ్స్ పెట్టుకుని పాడుతున్నారు. దానివల్ల గాయకులకు పాటపై పూర్తి అవగాహన ఉంటుంది. బయట శబ్దం వినిపించదు. బ్లూటూత్ ద్వారా వాయిద్య కారుల సంగీత పరికరాలతో అనుసంధానం అయి ఉంటుంది..

అలాంటి సమయంలో ఎంతో లాభం..

భారీ బహిరంగ సభలో.. ఆడియో విడుదల కార్యక్రమంలో..ప్రీ రిలీజ్ ఈవెంట్లలో గాయకులు పాడే సమయంలో ఇయర్ బడ్స్ ఉపయోగపడతాయి. దానివల్ల ప్రేక్షకుల అరుపులు, కేరింతలు వినిపించవు. అదే సమయంలో పాటపై గాయకులకు పూర్తిస్థాయిలో స్పష్టత ఉంటుంది.. బయటి వ్యక్తుల చేష్టల వల్ల గాయకులకు డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉండదు. అందువల్లే ప్రస్తుత కాలంలో ఇయర్ బడ్స్ ను ఎక్కువగా వాడుతున్నారు. ఇందులో ఆపిల్ కంపెనీ తయారు చేసే ఇయర్ బడ్స్ వాడడానికి గాయకులు మక్కువ చూపిస్తున్నారు.