3 Movie Re Release : చరిత్ర తిరగరాసిన ‘3’ రీ రిలీజ్..2 రోజుల్లో ఈ రేంజ్ వసూళ్లా? మన స్టార్ హీరోలకు కూడా ఇంత రాలేదుగా!

నిన్న విడుదలైన ఈ చిత్రానికి కేవలం ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ నుండే కోటి 50 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ స్థాయి వసూళ్లు ఇప్పటి వరకు ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి సూపర్ స్టార్స్ కి కూడా రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Written By: Vicky, Updated On : September 15, 2024 9:09 pm

3 Movie Re Release

Follow us on

3 Movie Re Release :  టాలీవుడ్ లో రీ రిలీజ్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తున్నారు. హీరో ఎవరు ఏమిటి అనేది అసలు చూడడం లేదు. చిన్న హీరోల సినిమాలు, డబ్బింగ్ హీరోల సినిమాలకు కూడా క్యూలు కట్టేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది కుర్ర హీరోల కొత్త సినిమాలకు కూడా రానటువంటి ఓపెనింగ్స్ ని పాత సినిమాలకు ఇచ్చేస్తున్నారు ఆడియన్స్. ఉదాహరణకు సిద్దార్థ్ ని తీసుకోండి. ఈయనకు తెలుగు లో మార్కెట్ పోయి చాలా కాలం అయ్యింది. ఆయన సినిమాలు విడుదల అయితే థియేటర్స్ కూడా దొరకని ప్రరిస్థితి ఉంది ప్రస్తుతం. అయినప్పటికీ కూడా ఆయన హీరో గా నటించిన ‘ఓయ్’ సినిమాని రీ రిలీజ్ చేస్తే ఆడియన్స్ మూడు కోట్ల రూపాయిల గ్రాస్ కలెక్షన్స్ ని ఇచ్చారు. ఇప్పుడు రీసెంట్ గా ధనుష్ నటించిన ‘3 ‘ చిత్రానికి కూడా ఇదే రేంజ్ వసూళ్లు వస్తున్నాయి.

నిన్న విడుదలైన ఈ చిత్రానికి కేవలం ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ నుండే కోటి 50 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ స్థాయి వసూళ్లు ఇప్పటి వరకు ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి సూపర్ స్టార్స్ కి కూడా రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ చిత్రంలోని పాటలు ఆడియన్స్ కి అంతలా కనెక్ట్ అవ్వడం వల్లే ఈ స్థాయి వసూళ్లు వచ్చాయని విశ్లేషకులు చెప్తున్న మాట. కేవలం మొదటి రోజు మాత్రమే కాదు, రెండవ రోజు కూడా ఈ చిత్రానికి ఇదే స్థాయి వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం రెండవ రోజు ఈ చిత్రానికి కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. మొత్తం మీద రెండు రోజులకు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 50 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం లోని పాటలు అప్పట్లోనే ఇండియా ని షేక్ చేసాయి. కానీ కమర్షియల్ గా ఈ చిత్రం అంతగా ఆడలేదు. అప్పటి ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది.

తెలుగు లో కనీసం కోటి రూపాయిల షేర్ వసూళ్లు కూడా అప్పట్లో రాలేదు. అలాంటి చిత్రానికి రీ రిలీజ్ లో ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది మామూలు విషయం కాదు. పైగా ఇది మొదటి సారి రీ రిలీజ్ అయిన చిత్రం కాదు, రెండు సార్లు ఇంతకు ముందు రీ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇప్పుడు మూడవసారి కూడా రీ రిలీజ్ గతం లో వచ్చిన రెస్పాన్స్ కంటే రెండు రెట్లు ఎక్కువ అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ చిత్రం. ధనుష్ పేరు యూత్ ఆడియన్స్ కి తప్ప, మిగతా ఆడియన్స్ కి సరిగా తెలిసి కూడా ఉండదు. అలాంటి హీరోకి కూడా ఈ స్థాయి వసూళ్లు ఇచ్చారంటే మన తెలుగు ఆడియన్స్ ఎంత ఆకలి మీద ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.