Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొన్న ప్రతి కంటెస్టెంట్ కూడా తమదైన రీతిలో పార్టిసిపేట్ చేస్తూ షో లో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు అయితే ప్రతి కంటెస్టెంట్ తనదైన రీతిలో టాస్క్ లను ఎదుర్కొంటు ముందుకు సాగుతున్నారు. అయితే కొందరు మాత్రం టాస్కులలో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నారు. ఎదుటి వాళ్ళను టార్గెట్ చేస్తూ ఏదో హైలెట్ అయిపోవాలనే ఉద్దేశ్యం తో ఏదో ఒకటి మాట్లాడుతూ పర్ఫామెన్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోయిన కూడా ప్రేక్షకుల్లో గుర్తింపు పొందాలని చూస్తున్నారు. ఇక అలా చేసి నెగెటివిటి ని సంపాదించుకున్న టాప్ కంటెస్టెంట్స్ ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం…
ముందుగా సోనియా గురించి తెలుసుకున్నట్లైతే ఆమె ఈ వారంలో ఎలాంటి పర్ఫామెన్స్ ని అయితే ఇవ్వలేదు. ఆమె చేసిన అతి వల్లే ఆమె మీద చాలావరకు నెగిటివిటీ అయితే పెరుగుతుంది. ఇక విష్ణుప్రియ ని టార్గెట్ చేసి ఆమె విషయంలో సోనియా అనుసరిస్తున్న వైఖరి ఏ ఒక్కరికి నచ్చడం లేదు. అలాగే పెద్దోడు చిన్నోడులను పక్కన పెట్టుకొని ఆమె చేస్తున్న ఆక్టివిటీస్ కూడా ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నాయి. ఇక దానికి తోడుగా ఆమె టాస్కులలో ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేక పోతుంది.టాస్క్ లను సరిగ్గా ఆడలేక తన చిన్ కి ఒక గాయాన్ని కూడా తగిలించుకుంది.
ఇక మొత్తానికైతే సోనియా ఈ వారం పర్ఫామెన్స్ ఏమి లేకపోగా ప్రేక్షకుల అటెన్షన్ మాత్రం తన మీద ఉండేలా ఏదో చేయాలనుకొని ఇంకేదో చేసేస్తుంది…ఒక సంచాలకులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆమె కొంత వరకు సరైన నిర్ణయాన్ని తీసుకుంది. తప్ప మిగితా అన్ని విషయాలలో ఫెయిల్ అయిపోయింది…
ఇక నెగిటివిటీ ని సంపాదించుకున్న నెంబర్ 2 కంటెస్టెంట్ యష్మి…ఈమె కూడా విష్ణు ప్రియ ని టార్గెట్ చేసి ఇంతకుముందు ఆమె మానస్ తో కలిసి చేసిన ఒక సాంగ్ ను ఇమిటేట్ చేస్తూ ‘జారుతున్నదిరో చేజారుతున్నదిరో’ అంటూ విష్ణు ప్రియ కనిపించిన ప్రతిసారి తనను ఇమిటేట్ చేస్తూ డ్యాన్స్ చేయడం. సోనియాని పక్కన పెట్టుకొని విష్ణు ప్రియ మీద చిల్లర కామెంట్స్ అయితే చేసింది. ఇక అలా చేయడం వల్ల తను దిగజారి పోవడమే తప్ప ఆమెకి ఒరిగేది ఏమీ లేదు. ఇక అవతలి వాళ్ళ ఎమోషన్స్ ను పట్టించుకోకుండా హేళనగా ఇలాంటి ఇమిటేషన్లు చేయడం వల్లే ప్రేక్షకుల దృష్టిలో ఆమె బ్యాడ్ అయింది.
ఇక దీంట్లో విష్ణు ప్రియ కి జరిగిన నష్టం అయితే ఏమీ లేదు. అలాగే ప్రేరణను సంచాలకులు గా చేసి తను మనకే సపోర్ట్ చేయాలనే విధంగా చాలా రాష్ గా మాట్లాడటం. ఇవన్నీ యష్మి కి మైనస్ గా మారడమే కాకుండా ప్రేక్షకుల దృష్టి లో కూడా తను బ్యాడ్ అయ్యేలా చేస్తుంది…