CM Chandrababu : చంద్రబాబు( AP CM Chandrababu).. ఈ మాట వింటే గుర్తుకొచ్చే పేరు టెక్నాలజీ. దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాంటి నేత చంద్రబాబు టెక్నాలజీకి జై కొట్టారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని.. తన స్నేహితుడు చంద్రబాబు టెక్నాలజీకి ఆధ్యుడు అని కొనియాడారు. గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబును చూసి చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ నిర్మించిన ఘనత ఆయనదే. దీనిని ఆయన ప్రత్యర్థులు సైతం ఒప్పుకుంటారు. అయితే చంద్రబాబు తనకున్న ఈ బ్రాండ్ ను అన్ని సందర్భాల్లో వాడుకోగలరు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అని చెబుతున్నారు. డ్రోన్స్ రంగానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇదంతా చంద్రబాబు ముందు చూపుతోనే చేస్తున్నారు.
Also Read : ఇంత చిన్న లాజిక్ బాబు సర్కార్ మిస్ అయ్యిందా?
* ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో..
తాజాగా విజయవాడలో( Vijayawada ) జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు ఏపీ సీఎం చంద్రబాబు. అక్కడ కూడా టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో టెక్ ఏఐ కాంక్లేవ్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏ పనైనా సులువుగా చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. గతంలో ఎక్కడ చూసినా రహదారులు గుంతలతో కనిపించేవారు. కానీ ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో రోడ్లను చక్కగా నిర్మించినట్లు చెప్పారు. మరోవైపు జాతీయ రహదారుల విస్తరణ విషయాన్ని కూడా ప్రస్తావించారు. సంపద సృష్టించాలి.. ప్రజలకు అందించాలి.. పేదరికం లేని సమాజమే లక్ష్యం అని తేల్చి చెప్పారు చంద్రబాబు. రైతు అనుబంధ రంగాల సేవలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కూడా చెప్పారు.
* ప్రసంగంలో చివరి మాటగా..
అయితే చంద్రబాబు తన ప్రసంగంలో చివరి మాటగా టెక్నాలజీని( Technology) ప్రస్తావించారు. ఏ సమావేశం అయినా తాను టెక్నాలజీ గురించి మాట్లాడకుండా ఉండలేనని కూడా చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందన్నారు. దానిని సద్వినియోగం చేసుకోవడంలో భారతదేశ ముందు ఉండడం ఆనందంగా ఉందన్నారు. అందులోనూ తెలుగు ప్రజలు టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నారని చెప్పారు. సాంకేతిక యుగంలో సమర్థత పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ప్రపంచంలోనే భారతీయులు ముందున్నారని చెప్పారు. అందులో తెలుగు ప్రజలు అధికంగా టెక్నాలజీని వాడుకొని అభివృద్ధి చెందుతున్న విషయాన్ని ప్రస్తావించారు. తద్వారా టెక్నాలజీకి తాను ఎంత ప్రాధాన్యం ఇచ్చానో.. తద్వారా ఎంత అభివృద్ధి జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఏ సమావేశం అయినా.. తన టెక్నాలజీకి కొంత భాగం చంద్రబాబు కేటాయించడం పరిపాటిగా మారింది.
ప్రపంచంలో తెలుగు వాళ్ళు CHAT GPT అత్యధికంగా వాడుతున్నందుకు నేను గర్వపడుతున్నాను
టెక్నాలజీ గురించి మాట్లాడకపోతే నా మీటింగ్ కంప్లీట్ కాదు – ఏపీ సీఎం చంద్రబాబు pic.twitter.com/UVdXzIQafz
— Telugu Scribe (@TeluguScribe) May 14, 2025