Homeఆంధ్రప్రదేశ్‌AP Liquor scam : ఇంత చిన్న లాజిక్ బాబు సర్కార్ మిస్ అయ్యిందా?

AP Liquor scam : ఇంత చిన్న లాజిక్ బాబు సర్కార్ మిస్ అయ్యిందా?

AP Liquor scam  : ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam ) ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో కీలక అరెస్టులు కొనసాగుతున్నాయి. జగన్ సర్కార్ హయాంలో మద్యం ద్వారా భారీగా అవినీతికి పాల్పడ్డారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికిగాను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 3500 కోట్ల రూపాయలు హవాలా రూపంలో దేశం దాటించేశారని అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో కీలక సూత్రధారిగా రాజ్ కసిరెడ్డి ఉన్నారు. ఆయన అరెస్టు జరిగింది. తాజాగా బాలాజీ గోవిందప్పను అరెస్టు చేశారు. మరోవైపు ఈ కేసుతో సంబంధం ఉన్న ఎంపీ మిధున్ రెడ్డి సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. ఒకరిద్దరు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. అరెస్టు విషయంలో కీలక సూచనలు చేసింది న్యాయస్థానం.

Also Read : ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు

* మద్యం పాలసీని మార్చి..
2019లో అధికారంలోకి వచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ). అప్పటివరకు ఉన్న మద్యం పాలసీని మార్చింది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడిపింది. అయితే అప్పటి వరకు ఉన్న ప్రీమియం బ్రాండ్ల స్థానంలో నాసిరకం మద్యం అందుబాటులోకి తెచ్చిందన్న విమర్శలు వచ్చాయి. దేశంలో ఎక్కడా చూడని.. వినని మద్యం బ్రాండ్లు ఏపీలో దర్శనం ఇచ్చాయి. మద్యం ధరను కూడా అమాంతం పెంచేసింది. అయితే ఐదేళ్లపాటు మద్యం ఆదాయం భారీగా సమకూరింది. ఇప్పుడు మద్యం కుంభకోణం బయటకు రావడంతో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 2014 నుంచి 2019 వరకు పాలించిన టిడిపి సర్కార్ మద్యం ఆదాయం 70,476 కోట్లు.. అదే 2019 నుంచి 2024 మధ్య వైసీపీ సర్కార్లో మద్యానికి వచ్చిన ఆదాయం అక్షరాల 1,06,065 కోట్లుగా చెబుతోంది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే మద్యం స్కాం ఎలా జరిగింది అన్నది లాజిక్ ప్రశ్న వేస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. వైసిపి సానుభూతి విశ్లేషకులు సైతం ఇదే విషయాన్ని హైలెట్ చేస్తున్నారు.

Also Read : మద్యం బాబులకు షాక్… ఏపీలో కొత్త విధానం..

* ఆదాయం సరే.. కమీషన్ల మాటేంటి?
అయితే ఏపీలో వైసీపీ పాలనలో ఒక్కసారిగా మద్యం ధర పెరిగింది. నాసిరకం బ్రాండ్లు రెట్టింపు చేసి అమ్ముకున్నారు. 2019 ఎన్నికలకు ముందు క్వార్టర్ మద్యం 110 రూపాయలు ఉంటే.. ఎన్నికల అనంతరం వైసిపి ప్రభుత్వం 220 రూపాయలకు పెంచింది. ప్రీమియం బ్రాండ్ బీరు ధర 100 నుంచి 120 రూపాయలు ఉంటే.. దానిని 240 రూపాయలకు పైగా పెంచింది. నాసిరకం మద్యంతో ఎక్కువ ఆదాయం సమకూరింది. అయితే ఇక్కడే వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియాకు అంతు పట్టని ఒక విషయం అర్థమవుతుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగిన మాట వాస్తవమే. కానీ డిష్టలరీలు, మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి పెద్ద ఎత్తున కమీషన్లు దండుకొని అనుమతులు ఇచ్చారన్నదే ప్రధాన ఆరోపణ. ప్రభుత్వానికి మద్యం ఆదాయం సరే.. కానీ ఒక్కో బాటిల్ వద్ద 50 రూపాయలు చొప్పున కమీషన్ దండుకున్నారు అన్నదే ప్రధానంగా ఆరోపించే విషయం. కానీ వైసిపి సోషల్ మీడియా, ఆ పార్టీ అనుకూలూరు మాత్రం ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని మాత్రమే చెబుతున్నారు. కానీ కమీషన్ల రూపంలో దండుకున్న విషయాన్ని మరిచిపోతున్నారు. అయితే లాజిక్కుల పేరుతో.. మద్యం కుంభకోణాన్ని తక్కువగా చూపే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular