Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైనా హీరో నవీన్ చంద్ర(Naveen Chandra). ఈ సినిమా తర్వాత ఆయన హీరో గా ఎన్నో సినిమాల్లో నటించాడు, కానీ సక్సెస్ లు దక్కలేదు. దీంతో క్యారక్టర్ ఆర్టిస్టు గా మారి, వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. ఈ ఏడాది ఆయన ప్రధాన పాత్ర పోషించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిన సంగతి మన అందరికి తెలిసిందే. ఈ చిత్రం లో ఆయన క్యారక్టర్ కి కూడా పెద్దగా పేరేమి రాలేదు. కేవలం రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలో నటించాను అనే తృప్తి మాత్రమే నవీన్ చంద్ర కి మిగిలింది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన కొన్ని ఆసక్తికరమైన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read : తండ్రైన యంగ్ హీరో… ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు!
ఇంతకీ ఆయన ఏమి మాట్లాడాడంటే ‘రీసెంట్ గా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఉద్రిక్తత పరిస్థితులను చూసి, అసలు నేను నటుడిని ఎందుకు అయ్యానా అని బాధపడ్డాను. నా మీద నాకే కోపం వచ్చింది. నేను నా పదవ తరగతి పూర్తి చేసిన వెంటనే మా ఇంట్లో నన్ను డిప్లమో లో జాయిన్ చెయ్యాలని అనుకున్నారు. కానీ నాకు చిన్నతనం నుండి దేశం కోసం పని చెయ్యాలి, ఆర్మీ లో జాయిన్ అవ్వాలి అని చాల్ కోరికగా ఉండేది. కానీ నా కుటుంబం నన్ను త్యాగం చేయడానికి సాహసం చేయలేదు. ఇంటికి పెద్ద దిక్కు మా కొడుకు, అతను ఆర్మీ కి పోతే ఎలా అని భయపడ్డారు. దీంతో వాళ్ళ కోసం నేను ఆర్మీ లోకి వెళ్ళాలి అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నేను చేరలేకపోయాను కానీ, నా తమ్ముడు మాత్రం సీఆర్ఫీఎస్ లో ఉన్నాడు. ఆర్మీ ఆశలు వదులుకున్నప్పుడు మొదట్లో నాకు చాలా బాధగా అనిపించింది. కానీ ఆ తర్వాత చిన్నగా నా మనసుకి నచ్చచెప్పుకున్నాను. కానీ రీసెంట్ గా జరిగిన ఘటనలు చూసిన తర్వాత నేను ఎంత పెద్ద పొరపాటు చేసానో అర్థమైంది. ఆర్మీ లోకి వెళ్లాలనే నా కోరికపై దృడంగా నిలబడి ఉంటే కచ్చితంగా వెళ్ళేవాడిని ఏమో. ఇప్పుడు చేరుదామని అనుకున్నా నా వయస్సు పరిమితి దాటిపోయింది. దేవుడు దయ చూపించి, ఒకవేళ నాకు ఇప్పుడు ఆర్మీ లో జాయిన్ అయ్యే అవకాశాన్ని కల్పించినా క్షణం కూడా ఆలోచించకుండా చేరిపోతాను’ అంటూ చెప్పుకొచ్చాడు నవీన్ చంద్ర. ఆయన మాట్లాడిన మాటలకు నెటిజెన్స్ నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది. దేశానికీ సేవ చేయడమే వృత్తి గా చేసుకోవాలనే ఆలోచనలు ఉన్న నీలాంటోళ్ళు ఉన్న ఈ దేశం లో ఉన్నందుకు గర్విస్తున్నాము అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : తండ్రి కాబోతున్న మరో తెలుగు హీరో