Double ISmart: డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం ఆ సాహసం చేస్తున్న రామ్ పోతినేని…

ఇప్పుడు ఎలాగైనా పాన్ ఇండియాలో తన సత్తా చాటాలనే సంకల్పంతో ఈ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఎవ్వరూ చేయనటువంటి సాహసాలు కూడా తను చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : May 4, 2024 8:59 am

Double ISmart

Follow us on

Double ISmart: తెలుగులో యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో రామ్ పోతినేని… దేవదాసు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకొని ప్రేక్షకులను అలరించడమే కాకుండా తన ఎనర్జీతో ప్రతి ఒకరిని తన అభిమానిగా మార్చుకున్నాడు. ఇక మొత్తానికైతే ఈయన వరుస సినిమాలను చేస్తూ యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాని పూరి జగన్నాథ్ డైరెక్షన్ చేస్తున్నాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో 2019 వ సంవత్సరంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాని తొందరలోనే రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇలాంటి క్రమం లోనే రామ్ ఈ సినిమా కోసం భారీగా కష్ట పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత వచ్చిన రెడ్, స్కంద వారియర్ లాంటి సినిమాలు డిజాస్టర్లవ్వడంతో ఆయన మార్కెట్ భారీగా పడిపోయింది.

ఇప్పుడు ఎలాగైనా పాన్ ఇండియాలో తన సత్తా చాటాలనే సంకల్పంతో ఈ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఎవ్వరూ చేయనటువంటి సాహసాలు కూడా తను చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఎండలో కూడా తను విపరీతంగా కష్టపడుతూ మరి సాహసోపేతమైన ఫీట్స్ ని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. హీరోలు ఎక్కువగా డూప్ లను వాడుతూ ఉంటారు.

కానీ రామ్ మాత్రం ఈ సినిమాలో డూప్ లను వాడడానికి ఎక్కువ ఇష్టపడడం లేదు. వీలైనంతవరకు ఆయనే స్వయంగా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు ఉన్నప్పుడే తను డూప్ కి వెళ్తున్నాడు. అంతే తప్ప అంతకుమించి మొత్తం సినిమాలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ గాని,డ్యాన్స్ మూమెంట్స్ గాని అన్ని తనే పర్ఫెక్ట్ గా చేస్తూ ముందుకు సాగుతున్నాడు… ఇక ఈ సినిమాతో కనక ఆయన భారీ సక్సెస్ కొడితే పాన్ ఇండియాలో రామ్ కూడా స్టార్ హీరోగా గుర్తింపు పొందుతాడు…